Telugu Gateway
Top Stories

కుప్ప‌కూలిన చైనా రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్

కుప్ప‌కూలిన చైనా రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్
X

చైనా ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో రియ‌ల్ ఎస్టేట్ రంగానిది అత్యంత కీల‌క‌పాత్ర‌.ఇప్పుడు అక్క‌డ ఈ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఎప్ప‌టికి ఈ రంగం రిక‌వ‌రి అవుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. గ‌త ఏడాది జులైతో పోలిస్తే 2022 జ‌లైలో చైనా రియ‌ల్ ఎస్టేట్ అమ్మ‌కాలు ఏకంగా 40 శాతం మేర త‌గ్గుముఖం ప‌ట్టాయి. దేశ వ్యాప్తంగా నిర్మాణం పూర్తికాక ముందే అమ్మిన ఇళ్ల‌కు సంబంధించి కొనుగోలుదారులు డ‌బ్బులు చెల్లించ‌టం నిలిపివేశారు. రియ‌ల్ ఎస్టేట్ రంగానికి తీవ్ర పెట్టుబ‌డుల స‌మ‌స్య రావ‌టంతో ప్ర‌జ‌లు అంతా రుణాల చెల్లింపుల‌ను బాయ్ కాట్ చేశారు. దీంతో ప్రాజెక్టులు ఎక్క‌డ‌వి అక్క‌డే ఆగిపోయాయి.

ఈ సంక్షోభం కార‌ణంగా చైనా బ్యాంకులు 356 బిలియ‌న్ డాల‌ర్ల మేర న‌ష్టాలను చూవిచూసే ప్ర‌మాదం ఉంద‌ని ఎస్అండ్ పి గ్లోబ‌ల్ రేటింగ్స్ అంచ‌నా వేసింది. దేశంలోని 90 న‌గ‌రాల్లో ఇళ్ల‌ను కొనుగోలు చేసిన వారు చెల్లింపుల‌ను బాయ్ కాట్ చేశారు. రియ‌ల్ ఎస్టేట్ సంక్షోభంలో బ్యాంకుల భారీ చిక్కుల్లో పడే ప్ర‌మాదం ఉంద‌ని అక్క‌డి నిపుణుల అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఆర్ధిక సాయం అందించ‌కపోతే వీటి న‌ష్టాలు మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. చైనాలోని బ్యాంకులు ఏ ఇత‌ర రంగంతో పోల్చినా అత్య‌ధిక మొత్తాల‌ను రియ‌ల్ ఎస్టేట్ రంగానికే రుణాలు ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు.

Next Story
Share it