Telugu Gateway
Top Stories

చైనా వ్యాక్సిన్ కు ఎదురుదెబ్బ

చైనా వ్యాక్సిన్ కు ఎదురుదెబ్బ
X

కరోనా వైరస్ కు కారణమైన చైనా సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ కు ఎదురుదెబ్బ తగిలింది. చివరి దశలో ఉన్న సినోవాక్ కోవిడ్ 19 వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేశారు. పరీక్షల్లో తీవ్ర ప్రతికూల ఫలితాలు రావటంతో బ్రెజిల్ లో వీటిని ఆపేశారు. సినోవాక్ వ్యాక్సిన్ ను ఇప్పటికే బీజింగ్ లో పది వేల మందికిపైగా ఇచ్చారు. సినోవాక్ వ్యాక్సిన్ ప్రయోగించిన కొందరిలో మరణాలు సంభవించగా ఇతర దుష్ప్రభావాలు మరణానికి దారితీసేవి, దీర్ఘకాలం అనారోగ్యానికి గురిచేసేవి ఉన్నాయన్నారు.

సినోవాక్ దుష్పలితాలు అక్టోబర్ 29న వెల్లడైనట్లు తెలిపారు. అయితే కంపెనీ మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా మధ్యలో ఆపేసి..తర్వాత తిరిగి ప్రారంభించారు. అయితే చైనా వ్యాక్సిన్ విషయంలో ఇతర అంశాలు వెల్లడికావాల్సి ఉంది.

Next Story
Share it