Telugu Gateway
Top Stories

గోడలు బద్దలు కొట్టుకుని విమానాశ్రయంలో దోపిడీకి ప్లాన్

గోడలు బద్దలు కొట్టుకుని విమానాశ్రయంలో దోపిడీకి ప్లాన్
X

విమానాశ్రయంలోకి ప్రవేశించాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. టికెట్ ఉంటే తప్ప లోపలి అడుగుపెట్టలేము. అయితే విమానాశ్రయాలు వేల ఎకరాల్లో ఉన్నా చుట్టూ ప్రహరీతో పాటు నిరంతర నిఘా ఉంటుంది. అయినా అప్పుడప్పుడు కొంత మంది అక్రమంగా లోపలి ప్రవేశిస్తుంటారు. రన్ వే మీద కూడా దర్శనం ఇచ్చి అరెస్ట్ అయిన ఘటనలు ఉన్నాయి. అచ్చం సినిమాల్లో జరిగిన తరహాలోనే విమానాశ్రయంలో ఉన్న ఒక విమానంలో మన కరెన్సీ లో అయితే 260 కోట్ల రూపాయల విలువైన నగదు ఉంది. ఇది అంతా డాల్లర్ల రూపంలో కూడిన నగదు పెట్టే ఉంది. ఫ్లోరిడా లోని మియామి నుంచి ఈ నగదును ప్రత్యేక విమానంలో చిలీ కి తీసుకు వచ్చారు. అక్కడి నుంచి ఈ మొత్తాన్ని వివిధ బ్యాంకు లకు తరలించాల్సి ఉంది. విమానం నుంచి డబ్బును తరలించే వాహనంలోకి మారుస్తుండగా దొంగల ముఠా దాడి చేసింది.

అలా ఇలా కాదు...ఏకంగా వాహనాలతో గోడలను బద్దలు కొట్టుకుని మరి లోపలికి ప్రవేశించి దాడి చేశారు. ఈ సమయంలో ఏకంగా కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. దొంగలు భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న గన్స్ కూడా లాక్కుని దాడి చేశారు. దీంతో ఎయిర్ పోర్ట్ పోలీస్ లు కూడా కాల్పులు జరిపారు. ఈ సమయంలో విమానాశ్రయ సిబ్బంది ఒకరు..దొంగల్లో ఒకరు మరణించారు మిగిలిన వారిని పట్టుకునేందుకు పోలీస్ లు రంగంలోకి దిగారు. మొత్తానికి డబ్బు మాత్రం దొంగల పరం కాకుండా కాపాడగలిగారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటి అంటే శాంటియాగో విమానాశ్రయంలో 2020 లో కూడా దొంగలు ఒకసారి లోపలికి ప్రవేశించి కోట్ల రూపాయల వస్తువులు దోచుకెళ్లారు. ఈ సారి మాత్రం నగదు దోపిడీ ప్లాన్ ఫెయిల్ అయింది.

Next Story
Share it