Telugu Gateway
Top Stories

ట్విట్టర్ పై కేంద్రం ఆగ్రహం

ట్విట్టర్ పై కేంద్రం ఆగ్రహం
X

రైతు ఉద్యమానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఖాతాలపై చర్యలు తీసుకోవాలని..లేదంటే చర్యలు తప్పవంటూ ట్విట్టర్ ను కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ ఏకంగా 100 ఖాతాలను తొలగించింది. అదే సమయంలో 150 ట్వీట్లను కూడా తీసేశారు. వీటిలో కిసాన్ ఏక్ మోర్చా, బీకెయూ ఖాతాలు ఉన్నాయి.

దీనిపై దుమారం రేగటంతో కొన్ని గంటల వ్యవధిలోనే ట్విట్టర్ ఆ ఖాతాలను పునరుద్ధరించటంతోపాటు, ట్వీట్లను కూడా కొనసాగించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ట్విట్టర్ ఖాతాలను పునరుద్ధరించటంపై సర్కారు సీరియస్ అయింది.ట్విట్టర్ ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందేనని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Next Story
Share it