Telugu Gateway
Top Stories

వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయాలు

వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయాలు
X

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా పలు నిర్ణయాలు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్ష్యతన జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 45 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. దేశీయంగా వ్యాక్సిన్ తయారీ సంస్థలను ప్రోత్సహిస్తూనే ..విదేశీ వ్యాక్సిన్ల కూడా వేగవంతంగా అనుమతులు మంజూరు చేయనున్నారు. తొలి దశలో కేవలం ఫ్రంట్ లైన్ వారియర్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. తర్వాత దీన్ని ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న అరవై సంవత్సరాల వారికి, అక్కడ నుంచి 45 సంవత్సరాల వారికి అనుమతిస్తూ వచ్చారు.

ఇప్పుడు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే సమయంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కూడా పలు వెసులుబాట్లు కల్పించారు. 50 శాతం వ్యాక్సిన్లను అమ్ముకునేందుకు తయారీ సంస్థలకు అనుమతి ఇచ్చారు. రాష్ట్రాలకు మార్కెట్లో విక్రయించుకోవచ్చు. తయారీ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు కూడా అనుమతి ఇచ్చారు. ఇఫ్పటివరకూ నియంత్రిత విదానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం మాత్రమే వ్యాక్సిన్లు తీసుకుని రాష్ట్రాలకు సరఫరా చేస్తూ వచ్చింది. వ్యాక్సిన్లను మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు రావటంతో ప్రైవేట్ రంగంలో ఇది మరింత పెద్ద ఎత్తున సాగే అవకాశం ఉంది.

Next Story
Share it