సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు
దేశంలో కరోనా రెండవ దశ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పదవి తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత మదింపు ఆధారంగా పదవ తరగతి విద్యార్ధులను ప్రమోట్ చేసి మార్కులు కేటాయించనున్నారు. అయితే ఈ మార్కులపై ఏ విద్యార్ధి అయినా సంతృప్తి చెందకపోతే పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత వారికి పరీక్షలు నిర్వహిస్తారు.
12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే మే-జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. జూన్ లో పరిస్థితిని సమీక్షించి 12వ తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్ధుల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.