Telugu Gateway
Top Stories

కార్ ఆటో మోడ్ లో పెట్టి కార్డ్స్ ఆడారు!

కార్ ఆటో మోడ్ లో పెట్టి కార్డ్స్ ఆడారు!
X

అది మహీంద్రా ఎక్స్ యూవీ 700 కారు. ఇందులో ఉన్నది అంతా యూతే. వీళ్ళు ఈ వాహనాన్ని రోడ్డు ఎక్కించారు. స్టీరింగ్ వదిలేసి ఎంచక్కా పేకాట (కార్డ్స్ ) ఆడటం మొదలు పెట్టారు. అంతే కాదు దీనికి సంబదించిన వీడియో కూడా తీసి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. టెక్నాలజీ ఉన్నది ఇందుకా అంటూ చాలా మంది వీళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్న తేడా వస్తే చాలు ఈ సరదా ఖరీదు ఎంతో విలువైన ప్రాణం అవుతుంది అంటూ హెచ్చరించారు. ఇది ఎక్కడ జరిగింది అన్నది క్లారిటీ లేదు కానీ..ఈ వీడియో మాత్రం పెద్ద సెన్సేషన్ గా మారింది.

ఈ కార్ లో ఉన్నవాళ్లే మహీంద్రా ఎక్స్ యూవీ 700 కారులోని అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏడీఏఎస్) ఉపయోగించి ఇలా చేసినట్లు తెలిపారు. ఇందులో ఆటో మోడ్ లో పెట్టుకొని సౌకర్యం ఉంటుంది. ఇది డ్రైవర్ సీట్ లో ఉన్న వాళ్లకు ఇప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తుంది. ఈ వాహనంలో ఉన్న వాళ్ళు ఎవరు సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకుండా ఇలా పేకాట ఆడుతూ కనిపించారు. కార్ లో ఎంత ఆటో మోడ్ సౌకర్యం ఉన్నా ఇలా చేయటం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని చెపుతున్నారు.

Next Story
Share it