Telugu Gateway
Top Stories

వ‌రుణ్ సింగ్ క‌న్నుమూత‌

వ‌రుణ్ సింగ్ క‌న్నుమూత‌
X

విషాదం. కెప్టెన్ వ‌రుణ్ సింగ్ క‌న్నుమూశారు. భార‌త‌దేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ (సీడీఎస్) బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న సైనిక హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఆయ‌న కూడా తీవ్ర గాయాల‌పాలై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న మృత్యువుతో చేసిన పోరాటంలో విఫ‌లం అయ్యారు. డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్‌ కూలిన ఘటనలో 14 మందిలో 13 మంది అదే రోజు మృతిచెందారు.

తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్ బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ ఈరోజు కన్నుమూశారు. వ‌రుణ్ సింగ్ మ‌ర‌ణ వార్త‌ను ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ ద్వారా వెల్ల‌డించింది. ఇది అత్యంత విచార‌క‌ర‌మైన అంశం అని పేర్కొంది. భార‌త వాయుసేన‌లో వ‌రుణ్ సింగ్ విశేష సేవ‌లు అందించారు. వ‌రుణ్ సింగ్ మ‌ర‌ణంపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ సంతాపం వ్య‌క్తం చేశారు.

Next Story
Share it