Telugu Gateway
Top Stories

క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్ ఐపీవో స‌న్నాహాలు

క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్ ఐపీవో స‌న్నాహాలు
X

మార్కెట్ నుంచి నిధుల స‌మీక‌ర‌ణ‌కు కంపెనీలు అన్నీ క్యూక‌డుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అనుకూల వాతావ‌ర‌ణాన్ని త‌మ‌కు కావాల్సిన వ‌న‌రుల‌ను సమీక‌ర‌ణ‌కు దారులు వేసుకుంటున్నాయి. ఇప్పుడు అదే బాట‌లో ప‌య‌నించేందుకు మ‌రో కంపెనీ రెడీ అయింది. అదే క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్. 2021 ఆర్ధిక సంవత్సరం కోసం ఆస్తుల‌ నాణ్యత, రిటైల్‌ డిపాజిట్లు, కాసా డిపాజిట్లు పరంగా భారతదేంలో అగ్రగామి ఎస్‌ఎఫ్‌బీలలో ఒకటిగా వెలుగొందుతున్న క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తమ డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ని సెబీ వద్ద దాఖలు చేసింది. భారతదేశపు మొట్టమొదటి స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌గా ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇతర ఎస్‌ఎఫ్‌బీలతో పోలిస్తే వైవిధ్యమైన ఆస్తుల్లో చెప్పుకోతగ్గ ఋణాలు సంస్ధకు ఉన్నాయి. ఈ కంపెనీ తమ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ ద్వారా 450 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దీనిలో భాగంగా 3,840, 087 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ఆఫర్‌లో పీఐవెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ 3,37,396 ఈక్విటీ షేర్లను విక్రయించనుండగా, 6,04,614 ఈక్విటీ షేర్లను అమిక్యుస్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఐ ఎల్‌ఎల్‌పీ ; అమికస్‌ క్యాపిటల్‌ పార్టనర్స్‌ ఇండియా ఫండ్‌ 1 70,178 ఈక్విటీ షేర్లు మరియు 8,36,728 ఈక్విటీ షేర్లను ఒమన్‌ ఇండియా జాయింట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ 2 ; డీఆర్‌హెచ్‌పీలో చెప్పబడిన వ్యక్తులు 1,991,171 ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తాలను బ్యాంకు యొక్క భావి మూలధన అవసరాలను తీర్చుకునేందుకు వినియోగిస్తారు. ఈ ఈక్విటీ షేర్లను బీఎస్‌ఈ మరియు ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ చేయనున్నారు.

Next Story
Share it