Telugu Gateway
Top Stories

మోడీకి మద్దతుగా మాట్లాడినందుకు కారు తో తొక్కించాడు !

మోడీకి మద్దతుగా మాట్లాడినందుకు కారు తో తొక్కించాడు !
X

ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. వినటానికి వింతగానే ఉన్నా పోలీస్ లు అధికారికంగా చెపుతున్న మాట ఇది. ఒక క్యాబ్ డ్రైవర్ కు, అందులో ప్రయాణించిన ఒక వ్యక్తికి మధ్య రాజకీయ అంశాలపై వాడి వేడి చర్చ జరిగింది. క్యాబ్ లో ప్రయాణించిన వ్యక్తి ప్రధాని మోడీ కి మద్దతుగా మాట్లాడగా క్యాబ్ డ్రైవర్ మాత్రం అందుకు బిన్నంగా మాట్లాడాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల వేడి పెరిగింది. దీంతో కారు దిగిన తర్వాత క్యాబ్ డ్రైవర్ అందులో ప్రయాణించిన 52 సంవత్సరాల రాజేష్ దూబే ను కారు తో తొక్కించాడు. ప్రధాని మోడీ పై క్యాబ్ డ్రైవర్ అంజాద్ అభ్యంతరకరంగా మాట్లాడటంతో దూబే కూడా అంతే గట్టిగా స్పందించినట్లు పోలీస్ లు తెలిపారు.

ప్రధాని మోడీ తో పాటు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కూడా అంజాద్ దూషించాడు. పోలీస్ లు క్యాబ్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. ఆరు గంటల పాటు వెతికి పోలీస్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీస్ లు అతడిని పట్టుకున్నారు. ఈ కారు లో మొత్తం ముగ్గురు ఉండగా అందులో ఇద్దరినీ వారి వారి ప్లేసుల్లో దింపేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దిగి ఇంటికి పోతున్న రాజేష్ దూబే పై కారు ఎక్కించి 200 మీటర్ల మేర అలాగే వెళ్ళాడు. దీంతో అయన అక్కడకు అక్కడే చనిపోయాడు. ఈ ఘటన పెద్ద కలకలం రేపింది. దీంతో ఎవరితో పడితే వాళ్ళతో రాజకీయ అంశాలపై మాట్లాడటం కూడా ఎంత ప్రమాదమే ఈ ఘటన చెపుతోంది .

Next Story
Share it