ప్రపంచ సంపన్నుడు ఎలన్ మస్క్ పెర్ ఫ్యూమ్ వ్యాపారంలోకి

రవాణా రంగంలో సాంకేతిక అంశాలతో కూడిన అంశాల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన బోరింగ్ కంపెనీ ద్వారా ఎలన్ మస్క్ ఈ పెర్ ఫ్యూమ్ ను విడుదల చేశారు. కంపెనీ వెబ్ సైట్ ద్వారా వీటిని విక్రయిస్తున్నారు. ఇప్పటికే పది వేల బాటిళ్లు అమ్మామని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరి ఇతర కంపెనీల తరహాలోనే ఈ కొత్త వ్యాపారం కూడా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది కొంత కాలం పోతే కానీ తెలియదు. డాలర్లే కాకుండా క్రిప్టో కరెన్సీ, డోజీ కాయిన్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ట్విట్టర్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని ...తర్వాత మస్క్ వెనక్కు తగ్గటంతో ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. మళ్లీ ట్విట్టర్ తో ఎలన్ మస్క్ బేరాలు మొదలుపెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి.