Telugu Gateway
Top Stories

యుఏఈ టూర్ లో మోడీ

యుఏఈ టూర్ లో మోడీ
X

ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని శనివారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ లోని ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకం పతాకంతో పాటు ప్రధాని మోడీ ఫోటో ను ప్రదర్శించారు. మోడీ పర్యటన కు గౌరవ సూచకంగా ఈ పని చేశారు. మోడీ కి అబు దాబి విమానాశ్రయంలో రాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు విద్యుత్, ఆహార భద్రత, రక్షణ రంగాలకు చెందిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

సహజంగా బుర్జ్ ఖలీఫా పై ఇలా వ్యక్తుల ఫోటోలు ప్రదర్శించాలి అంటే భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీనికి సుమారు 50 లక్షల వరకు ఛార్జ్ అవుతుంది. సెలెబ్రిటీలు తమ ప్రచారం కోసం బుర్జ్ ఖలీఫా పై యాడ్స్ ఇస్తుంటారు కూడా. గతంలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఇలాగే చేశారు. అయితే భారత ప్రధానికి గౌరవ సూచకంగానే బుర్జ్ ఖలీఫా పై త్రివర్ణ పతాకం, ప్రధాని మోడీ ఫోటోలను ప్రదర్శించారు.

Next Story
Share it