స్టాక్ మార్కెట్ దూకుడు
సోమవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఎక్కడలేని దూకుడు ప్రదర్శిస్తున్నాయి. గత కొంత కాలంగా ఎప్పటికప్పుడు జీవిత కాల గరిష్టాలను తాకుడూ ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. తాజాగా మరో కొత్త గరిష్టస్థాయిలకు చేరాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఉదయం ప్రారంభం నుంచి లాభాల్లోనే కొనసాగుతోంది. పది నలభై నిమిషాల సమయంలో ఏకంగా సెన్సెక్స్ 572 పాయింట్లు పెరిగి 56,696.88కి చేరింది. ఇది మరో కొత్త గరిష్ట స్థాయి కావటం విశేషం. ఎన్ఎస్ ఈలోనూ సేమ్ సీన్. పలు కీలక షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.
మార్కెట్లో అత్యధిక వెయిటేజ్ ఉన్న రిలయన్స్ షేరు ధర 29 రూపాయల లాభంతో 2255 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందటంతో మార్కెట్లలో పాజిటివ్ మూడ్ నెలకొంది. ఎస్ బిఐ షేరు కూడా ఏడు రూపాయల లాభంతో 419 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవలే లిస్ట్ అయిన జొమాటో షేరు కూడా ఆరు రూపాయల లాభంతో 130 వద్ద ఉంది.