Telugu Gateway
Top Stories

ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పుల్లేవ్

ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పుల్లేవ్
X

ఉద్యోగులు, మధ్య తరగతికి మరో సారి నిరాశే. కేంద్ర బడ్జెట్ లో ఆదాయ పన్ను శ్లాబులకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపుదారులకు మరోసారి ఆశాభంగం అయింది. అయితే 75 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రం కేంద్రం ఒకింత ఊరట కల్పించింది. వీరు ఐటి రిటర్న్ లు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. ఫించను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఈ మినహాయింపు కల్పిస్తారు.

పన్ను వివాదాల నివారణ కోసం వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 50 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు, 10 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వారు నేరుగా కమిటీకి అప్పీల్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పన్ను వివాదాల స్పందన కాలపరిమితి ఆరు నుంచి మూడేళ్లకు తగ్గిస్తున్నట్లు మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

Next Story
Share it