Telugu Gateway
Top Stories

స్టాక్ మార్కెట్లో అమ్మ‌కాల ఒత్తిడి

స్టాక్ మార్కెట్లో అమ్మ‌కాల ఒత్తిడి
X

గ‌రిష్ట స్థాయి వ‌ద్ద ఇన్వెస్టర్లు లాభాలు స్వీక‌రిస్తున్నారు. సంవ‌త్స‌రాంతం కావ‌టంతో అమ్మ‌కాల ఒత్తిడి పెరిగిన‌ట్లు క‌న్పిస్తోంది. స‌హ‌జంగా విదేశీ సంస్థాత ఇన్వెస్ట‌ర్లు (ఎఫ్ఐఐ)లు ఏడాది చివ‌ర్లో లాభాలు స్వీక‌రించి కొత్త ప్ర‌ణాళిక‌ల‌తో నూత‌న సంవ‌త్స‌రం మార్కెట్లోకి ప్ర‌వేశిస్తారు ఇది ఎన్నో సంత్స‌రాల నుంచి ఉన్న ట్రెండ్. అయితే ఎప్పుడూ ఇదే విధానం కొన‌సాగుతుంద‌ని చెప్ప‌లేం. అప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఎఫ్ ఐఐలు అయినా..ఇత‌ర మ‌దుప‌ర్లు నిర్ణ‌యాలు తీసుకుంటారు. ప్ర‌స్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు గ‌రిష్ట స్థాయిల వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో క‌రెక్షన్లు వ‌చ్చినా ఒవ‌రాల్ గా చూస్తే సూచీలు దూకుడు మీద ఉన్నాయ‌నే చెప్పాలి. సోమ‌వారం నాడు స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో మంచి దూకుడు చూపించాయి. ఆ త‌ర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు ఆసక్తి చూపించడంతో మార్కెట్‌ నష్టాలతో ముగిసింది.

మార్కెట్‌లో బ్లూ చిప్‌ కంపెనీలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు కంపెనీల షేర్లలో ఎక్కువగా అమ్మకాలు చోటు చేసుకోవడంతో మార్కెట్‌ నష్టాల్లోకి జారుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ సోమ‌వారం ఉదయం 59,103 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత 59,203 పాయింట్ల గరిష్టాన్ని టచ్‌ చేసేంది. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి వరుసగా పాయింట్లు నష్టపోతూ ఒక దశలో 58,248 పాయింట్లను తాకింది. ఈ రోజు గరిష్ట కనిష్టాల మధ్య ఏకంగా 957 పాయింట్ల తేడా నమోదు అయ్యింది. చివరకు 503 పాయింట్ల నష్టంతో 58,282 పాయింట్ల దగ్గర ముగిసింది. మరోవైపు నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 17,368 పాయింట​‍్ల దగ్గర క్లోజయ్యింది. ఈ ప‌క్షం రోజులు మార్కెట్లో భారీ ఎత్తున ఆటుపోట్లు ఉండే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

Next Story
Share it