సెన్సెక్స్ మరో కొత్త శిఖరానికి
BY Admin16 Sept 2021 2:00 PM IST
X
Admin16 Sept 2021 2:00 PM IST
దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ రన్ కొనసాగుతూనే ఉంది. తొలిసారి సెన్సెక్స్ 59 వేల పాయింట్లకు చేరింది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లతోపాటు రిలయన్స్ షేర్లు దుమ్మురేపటంతో ఈ కొత్త రికార్డు నమోదు అయింది. సెన్సెక్స్ తోపాటు నిఫ్టీ కూడా లాభాలతో జీవిత కాల గరిష్టం 17,598 పాయింట్లకు చేరింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ పది శాతం లాభాలతో దూసుకెళ్ళింది. దీంతోపాటు ఐటిసి, ఎస్ బిఐ తదితర షేర్లు లాభాల బాట పట్టాయి. గత కొంత కాలంగా మదుపర్లు మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో సెన్సెక్స్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదు చేసుకుంటూ వెళుతోంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సెన్సెక్స్ సరిగ్గా 294 పాయింట్ల లాభంతో 59,017.13 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Next Story