బీఎస్ఈ షేర్ల విలువ 280.5 లక్షల కోట్లు
దీంతో షేర్లు లాభాల బాట పట్టడంతో బీఎస్ఈ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కొత్త రికార్డు స్థాయిలకు చేరింది. ద్రవ్యోల్బణం తగ్గటంతోపాటు విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ పిఐ)లు కూడా తిరిగి దేశీయ మార్కెట్లోకి ప్రవేశించారు. గత కొన్ని నెలలుగా వరస పెట్టి భారతీయ మార్కెట్లలో విక్రయాలు సాగించిన వీరు జులైలో ఓ మోస్తరుగా..ఆగస్టులో మాత్రం భారీ ఎత్తున కొనుగోళ్ళు చేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవన్నీ కూడా బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగటానికి కారణం అయింది.