2026 కోసం కొత్త మోడల్స్

భారత్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్ కూలింగ్ సెగ్మెంట్లలో తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా బ్లూస్టార్ లిమిటెడ్ 2026 వేసవి కోసం సరికొత్త రూమ్ ఎయిర్ కండీషనర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. ఈ సమగ్రమైన పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల కస్టమర్ల అవసరాలు, వినియోగ వాతావరణాలకు అనుగుణంగా ఫ్లాగ్‌షిప్ ప్రీమియం రేంజి ఉత్పత్తులతో పాటు రూమ్ ఎయిర్ కండీషనర్లకు సంబంధించి 125 మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (BEE) ప్రమాణాలకు తగ్గట్లుగా ఉంటాయి. వివిధ అవసరాలకు అనుగుణంగా, విద్యుత్తును ఆదా చేసే, అత్యంత సమర్ధవంతమైన కూలింగ్ సొల్యూషన్స్‌కి నెలకొన్న డిమాండును తీర్చే విధంగా ఈ మోడల్స్ వ్యూహాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి. భారతదేశంలో రూమ్ ఎయిర్ కండిషనర్ల మార్కెట్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. పెరుగుతున్న ఆదాయ స్థాయులు, వేగవంతమైన పట్టణీకరణ, అలాగే ఉష్ణోగ్రతల తీవ్రత పెరగడం ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. వినియోగం తక్కువగా ఉన్న మార్కెట్లలో తొలిసారిగా వినియోగించే వారు అలాగే మరింత మెరుగైన పట్టణ ప్రాంతాల్లో రిప్లేస్‌మెంట్ డిమాండ్‌తో ప్రస్తుతం సుమారు 1.4 కోట్ల యూనిట్లుగా ఉన్న మార్కెట్ పరిమాణం 2030 నాటికి 3 కోట్ల యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇందులో ముఖ్యంగా టియర్-3, టియర్-4, టియర్-5 నగరాలు కీలక వృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం చిన్న స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఈ మార్కెట్లు టియర్-1 మరియు టియర్-2 శ్రేణి నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పోర్ట్‌ఫోలియోలో ఇన్వర్టర్, ఫిక్సిడ్ స్పీడ్, విండో ఏసీలు ఉన్నాయి. వివిధ ధరల శ్రేణుల్లో వినియోగదారులకు అనువైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. విశిష్టమైన వినియోగదారులను ఆకట్టుకునేలా ‘మిడ్‌నైట్ సిల్వర్’ ఫినిష్‌తో ‘ఐకానియా’ (‘Iconia’) అనే ప్రీమియం మోడల్‌ను ఆవిష్కరించడం ఇందులో ప్రధాన ఆకర్షణ. ‘సూపర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీలు’, ‘హెవీ డ్యూటీ ఏసీలు’, ‘హాట్ అండ్ కోల్డ్ ఏసీలు’, ‘యాంటీ వైరస్ టెక్నాలజీ ఏసీ’లను కూడా సంస్థ ఫ్లాగ్‌షిప్ మోడళ్లుగా విడుదల చేసింది. సూపర్ ఎనర్జీ ఎఫీషియెంట్ ఏసీల్లో డైనమిక్ డ్రైవ్ టెక్నాలజీ ఉంది. ఇది విద్యుత్తును ఆదా చేసే విధంగా, అధిక గాలి ప్రవాహంతో సమర్థవంతమైన కూలింగ్ అందిస్తుంది. ఈ టెక్నాలజీతో 1 టన్ను ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ISEER 6.25ని సాధించగలదు. ఇది సాధారణ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీతో పోలిస్తే సుమారు 45% ఎక్కువ ఎనర్జీ సామర్థ్యం కలిగి ఉంటుంది.
హెవీ డ్యూటీ ఏసీలను అధిక ఉష్ణోగ్రతలలో కూడా సమర్థంగా పనిచేసేలా రూపొందించారు. ఇవి 56°C వరకు తీవ్ర ఉష్ణోగ్రతల్లో కూడా అసాధారణమైన కూలింగ్ మరియు సౌకర్యాన్ని అందించగలవు. 55 అడుగుల వరకు గాలి పంపే సామర్థ్యం ఉండటంతో, తీవ్రమైన పరిస్థితుల్లో, 43°C వద్ద కూడా పూర్తి కూలింగ్ సామర్థ్యం కొనసాగుతుంది. హాట్ అండ్ కోల్డ్ ఏసీలు అన్ని కాలాల్లో ఉపయోగపడేలా రూపొందించబడ్డాయి. శీతాకాలపు తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల కోసం మైనస్ 5 డిగ్రీల సెల్సియస్‌లోనూ పనిచేసే మోడల్స్‌తో పాటు ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోయే శ్రీనగర్‌లాంటి మార్కెట్ల కోసం మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌లోనూ పని చేయగలిగే స్పెషలైజ్డ్ మోడల్‌ని కూడా బ్లూస్టార్ అందిస్తోంది. ‘యాంటీ-వైరస్ టెక్నాలజీ ఏసీ’ల శ్రేణి, గదిలో హానికర సూక్ష్మ జీవులు, ధూళి కణాలను ఫిల్టర్ చేసి, గదిలో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. మరింత అదనపు భద్రత కోసం, ముఖ్యంగా శీతాకాలంలో, ఎయిర్ ప్యూరిఫికేషన్ మోడ్‌లో కూడా ఈ యూనిట్లు పని చేస్తాయి. దాదాపు 50 మోడల్స్‌లో స్మార్ట్ వైఫై సదుపాయం ఉంటుంది. ఏఐ ఆధారిత అడాప్టివ్ కూలింగ్, కస్టమైజ్డ్ స్లీప్ మోడ్స్, వాయిస్ కమాండ్ టెక్నాలజీ మరియు ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లాంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా కన్వర్టబుల్ కూలింగ్ మోడ్‌లు, సెల్ఫ్ క్లీన్, డిఫ్రాస్ట్ క్లీన్ టెక్నాలజీ డిజిక్యూ ఆక్టా (DigiQ Octa) సెన్సార్లు, నానో బ్లూప్రొటెక్ట్ (Nano BluProtect) టెక్నాలజీతో పాటు గదిలో గాలి నాణ్యతను మెరుగుపర్చేలా అధునాతన మల్టీ-లేయర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌లు ఈ శ్రేణిలో ఉంటాయి. అఫోర్డబిలిటీని, లభ్యతను మరింతగా పెంచేలా ఇన్వర్టర్ కంప్రెసర్‌పై కంపెనీ జీవితకాల వారంటీ, పీసీబీలపై 5 ఏళ్ల వారంటీతో పాటు సులభమైన ఫైనాన్స్ సదుపాయాలను కూడా అందిస్తోంది.



