మార్కెట్ లోకి కొత్త ఉత్పత్తులు
వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ సంస్థ బ్లూ స్టార్ నూతన శ్రేణి డీప్ ఫ్రీజర్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. అరవై నుంచి ఆరు వందల లీటర్ల సామర్థ్యంతో వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఇవి ఎంతో ఇంధన సామర్ధ్యం కలిగి ఉండటంతో పాటు పర్యావరణ అనుకూల డీప్ ఫ్రీజర్లు అని సంస్థ ఎండీ బి. త్యాగరాజన్ వెల్లడించారు. ఆయన గురువారం నాడు హైదరాబాద్ లో కమర్షియల్ రిఫ్రిజిరేషన్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ఎం. శ్రీనివాస రెడ్డి తో కలిసి మీడియా తో మాట్లాడుతూ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తులు డెయిరీ, ఐస్ క్రీం, ఫ్రోజెన్ ఫుడ్, రెస్టారెంట్స్, ఆతిధ్య రంగం, సూపర్ మర్కెట్స్ కు ఎంతో అనుకూలంగా ఉంటాయని...వాళ్ల వాళ్ల అవసరాలకు అనుగుణంగా ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ డీప్ ఫ్రీజర్ల ధరలు 16000 నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించారు. మహారాష్ట్రలోని బ్లూ స్టార్ కు చెందిన వాడా లో ఉన్న అత్యాధునిక తయారీ యూనిట్ లోనే మొత్తం డీప్ ఫ్రీజర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ లో మూడు లక్షల డీప్ ఫ్రీజర్లు, లక్ష వాటర్ కూలర్లు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది అని తెలిపారు. దీంతో పాటు దేశంలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాణిజ్య రిఫ్రిజిరేషన్ వ్యాపారంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
దేశంలో పెద్ద ఎత్తున వివిధ రకాల పంటలు పండుతున్నా సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవటం వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని..ఈ నష్టాన్ని పరిమితం చేయాలంటే కోల్డ్ చైన్ ప్రొడక్ట్స్ ను ఎంత మేర అందుబాటులోకి తెస్తే అంత ప్రయోజనం ఉంటుంది అని త్యాగరాజన్ తెలిపారు. బ్లూ స్టార్ అందించే రిఫ్రిజిరేషన్ ప్రొడక్ట్స్ తో పాడు అయిపోయే ఉత్పత్తుల జీవిత కాలాన్ని మరింత కాలం పెంచే వీలు ఉంటుంది అన్నారు. అన్ని ఉత్పత్తులకు కలుపుకుని బ్లూ స్టార్ ఆర్ అండ్ డి పై చేసే ఖర్చు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న 2100 సేల్ అండ్ సర్వీస్ ఛానెల్ భాగస్వాముల ద్వారా తమ కస్టమర్స్ కు ఎలాంటి సమస్యలు వచ్చినా సత్వరమే స్పందించి సేవలు అందిస్తారు అని తెలిపారు. ఈ మేరకు సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ సిటీ లో ఉన్న యూనిట్ లో కూడా సామర్ధ్య విస్తరణ కోసం రాబోయే సంవత్సరాల్లో విస్తరణ చేస్తామని త్యాగరాజన్ వెల్లడించారు.