కొత్తగా వెయ్యి అవుట్ లెట్స్
ఏసి వేసుకుని పడుకుంటే కొన్ని గంటలు కాగానే చలిపుడుతుంది. చలిపుడుతుంది కదా అని కొద్ది సేపు ఏసీ ఆఫ్ చేస్తే చమట పోస్తుంది. ఏసి లు ఉపయోగించే ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. దీనివల్ల నిద్ర డిస్ట్రబెన్స్ అవుతుంది అన్నది కూడా వాస్తవమే. అయితే ఇలాంటి సమస్యలు లేకుండా చేసేందుకు బ్లూ స్టార్ స్మార్ట్ ఏసీలను అందుబాటులోకి తెచ్చింది. తమ తమ అవసరాలకు అనుగుణంగా ఏసీ ని ఆన్ చేసుకోవటంతో పాటు ఆఫ్ చేసుకునేలా...ఆయా గదుల్లో ఉష్టోగ్రతను కోరుకున్న విధంగా సెట్ చేసుకునే సౌకర్యం ఇప్పుడు బ్లూ స్టార్ స్మార్ట్ ఏసి ల్లో ఉంది. ఇప్పటికే ఈ మోడల్ అమ్మకాలు ప్రారంభం కాగా...2025 సంవత్సరంలో కంపెనీ ఏకంగా ఐదు లక్షల స్మార్ట్ ఏసి లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది అని బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ త్యాగరాజన్ వెల్లడించారు. ఈ వేసవి సీజన్ అమ్మకాలు లక్ష్యంగా బ్లూ స్టార్ మార్కెట్ లోకి కొత్తగా 150 మోడల్స్ రూమ్ ఏసీలను అందుబాటులోకి తెచ్చింది అని అయన వెల్లడించారు. బ్లూ స్టార్ ఏసి కనీస ధర 28990 రూపాయల వద్ద మొదలు అవుతుంది అని...అన్ని రకాల వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుని తమ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ వేసవి వాతారవరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఏసీ ల అమ్మకాలు వృద్ధి రేట్ 25 శాతం మేర ఉండే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నట్లు త్యాగరాజన్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీమ్ ద్వారా ఎన్ని ఎక్కువ ఏసీ లు అమ్మితే తమకు అంతా లాభం ఉంటుంది అన్నారు. ప్రస్తుతం బ్లూ స్టార్ మార్కెట్ వాటా 13 .75 శాతం ఉంది అని...వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 14 .25 శాతానికి చేరే అవకాశం ఉంది అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బ్లూ స్టార్ మార్కెట్ వాటా 15 శాతం వరకు ఉంది. బ్లూ స్టార్ కు ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ సిటీ లో ఏసి ల తయారీ ఉంది. రాబోయే సంవత్సరాల్లో ఇక్కడ యూనిట్ లో విస్తరణ కార్యకలాలు ప్రారంభించే అవకాశం ఉంది అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్లూ స్టార్ ఆర్ అండ్ డి పై 51 కోట్ల రూపాయల వరకు వ్యయం చేయనుంది. అదే సమయంలో కొత్తగా మరో వెయ్యి అవుట్ లెట్స్ ను ప్రారంభించబోతున్నారు. స్మార్ట్ ఏసి ల మార్కెట్ లో బ్లూ స్టార్ లీడర్ షిప్ పొజిషన్ లో ఉంది అన్నారు.
బ్లూ స్టార్‌కి చెందిన ‘సూపర్ ఎనర్జీ-ఎఫీషియెంట్ ఏసీ’ల్లో విశిష్టమైన డైనమిక్ డ్రైవ్ టెక్నాలజీ ఉంది. ఎయిర్‌ఫ్లో పరిమాణం అధిక స్థాయిలో ఉండేలా చూడటం ద్వారా తక్కువ విద్యుత్ వినియోగంతో అత్యధిక చల్లదనాన్ని అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఫలితంగా 1 TR ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలు 6.25 ISEER సాధించగలుగుతాయి. 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీల కన్నా 64% ఎక్కువగా విద్యుత్‌ను ఆదా చేయగలుగుతాయి. వేసవి సీజన్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో, కంపెనీ అత్యుత్తమ పనితీరు కనపర్చే ‘హెవీ డ్యూటీ ఏసీ’లను అందిస్తోంది. మెరుగైన స్పెసిఫికేషన్లతో 56°C వరకు వేడిమి తీవ్రత ఉన్నా, ఈ ఏసీలు సౌకర్యవంతంగా, అసాధారణమైన కూలింగ్‌ను అందిస్తాయి. 55 అడుగుల వరకు గాలిని విస్తరించగలిగే సామర్థ్యాలతో, తీవ్రమైన 43°C ఉష్ణోగ్రతల్లోనూ ఇవి పూర్తి స్థాయిలో కూలింగ్ సామర్థ్యాలను కలిగి ఉండి, సమర్ధవంతంగా పని చేస్తాయి. ‘హాట్ అండ్ కోల్డ్ ఏసీ’లనేవి సంవత్సరం పొడవునా సౌకర్యాన్ని అందించేలా రూపొందించబడ్డాయి. మైనస్ 10 డిగ్రీల సెల్సియస్‌లోనూ గదిలో ఉష్ణోగ్రత మెరుగ్గా ఉండేలా చూసే ఒక మోడల్‌ను బ్లూ స్టార్ రూపొందించింది. శ్రీనగర్‌లాంటి మార్కెట్ల కోసం ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల అవసరాల కోసం మైనస్ 2 డిగ్రీల సెల్సియస్‌లోనూ ఉష్ణోగ్రత తగిన స్థాయిలో ఉండేలా చూసే మరో శ్రేణి కూడా ఉంది అన్నారు.