Telugu Gateway
Top Stories

డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరకే డబ్బు

డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరకే డబ్బు
X

బిలియనీర్లకు ఇది ఇది పండగ ఏడాది అని చెప్పొచ్చు. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరకే మరింత డబ్బు వచ్చి పడుతుంది అనే విషయం ఈ లెక్కలు చూస్తే నమ్మొచ్చు. 2023 సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో బడా బడా బిలియనీర్లు సగటున రోజుకు 114 కోట్ల రూపాయల సంపాదించారు. ఇలాంటి వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల మంది వరకు ఉన్నారు. వీళ్లు అందరూ కలిసి తొలి ఆరు నెలల కాలంలో మొత్తం 852 బిలియన్ల అమెరికన్ డాలర్లను వెనకేసుకున్నారు. ఇందులో అగ్రస్థానం టెస్లా అధినేత ఎలాన్ మస్క్, పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఉన్నారు.

ఈ ఆరు నెలల కాలంలోనే ఎలాన్ మస్క్ సంపద 96 .6 బిలియన్లు పెరగా, మార్క్ జుకర్ బర్గ్ సంపద 59 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. 2020 తర్వాత బిలియనీర్ల సంపద ఈ స్థాయిలో పెరగటం ఇదే మొదటిసారి. స్టాక్ మార్కెట్ లో ఆయా కంపెనీల షేర్లు పెరగటం కూడా వీళ్లకు కలిసివచ్చింది. అయితే భారత్ కు చెందిన దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సంపద మాత్రం ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో అరవై బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. ఇది అంతా కూడా అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత వచ్చిన ప్రభావం అనే విషయం తెలిసిందే.

Next Story
Share it