Telugu Gateway
Top Stories

ఎలాన్ మస్క్ కు షాక్

ఎలాన్ మస్క్ కు షాక్
X

ఎలాన్ మస్క్ కు షాక్ . గత కొన్ని ఏళ్లుగా ప్రపంచంలో నంబర్ వన్ సంపన్నుడుగా ఉన్న అయన ఇప్పుడు ఆ హోదాను కోల్పోయారు. ఎప్పుడు అయితే అయన ట్విట్టర్ ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారో అప్పటి నుంచి అయన సంపద కరగటం స్టార్ట్ అయింది. ప్రధానంగా టెస్లా కంపెనీ షేర్ల పతనమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ట్విట్టర్ కొనుగోలుతో అయన ఫోకస్ ఎక్కువ అటు పెడతారనే ఉద్దేశంతో చాలా మంది టెస్లా షేర్లను అమ్మేసారు. దీంతో అవి కొద్దికాలం క్రితం కనిష్ట స్థాయికి పతనం అయ్యాయి. రకరకాల కారణాలతో ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ సంపన్నుడు నుంచి రెండవ ప్లేస్ కి పడిపోయాడు.

అయన స్థానాన్ని లూయిస్ విట్టన్ మాతృ సంస్థ ఎల్ వీ ఎం హెచ్ సీఈఓ బెర్నార్డ్ అర్నాల్ట్ దక్కించుకున్నారు. బెర్నార్డ్ అర్నాల్ట్ నికర విలువ 172 .9 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండవ ప్లేసులో ఎలాన్ మస్క్ కొనసాగుతుండగా...ప్రపంచ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ మూడవ ప్లేసులో ఉన్నారు. ఆ తర్వాత స్థానాలను బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, లారి ఎల్లిసన్ , ముకేశ్ అంబానీ, స్టీవ్ బామర్,, లారి పేజీ ఉన్నారు. ఎలాన్ మస్క్ సంపద ఒకప్పుడు 340 బిలియన్ డాల్లర్ల గరిష్ట స్థాయికి చేరగా, ఇప్పుడు అది 168 .5 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది.

Next Story
Share it