బిగ్ బ్యాంక్ స్కామ్..విలువ 34 వేల కోట్లు

దేశంలో అతి పెద్ద బ్యాంకు కుంభకోణం వెలుగుచూసింది. అలా ఇలా కాదు ఏకంగా పదిహేడు బ్యాంకుల కన్సార్టియాన్ని 34 వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి కొత్త రికార్డు నమోదు చేశారు. ఇప్పటివరకూ ఏబీజీ షిప్ యార్డు 20 వేల కోట్ల రూపాయలు, నీరవ్ మోడీ చేసిన 13 వేల కోట్ల రూపాయల స్కామ్ లే అతి పెద్ద బ్యాంకు మోసాలుగా ఉన్నాయి ఇప్పటివరకూ. తాజా స్కామ్ తో అవి కూడా వెనక్కిపోయాయి. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) కు చెందిన మాజీ ప్రమోటర్లు అయిన కపిల్ వాద్వాన్, ధీరజ్ వాద్వాన్ లతోపాటు మరో 13 మందిపై సీబీఐ ఈ మోసాలకు సంబంధించి తాజాగా కేసు నమోదు చేసింది. సీబీఐ అధికారులు ఈ నిందితులకు సంబంధించిన 11 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
బ్యాంకుల కన్సార్టియానికి యూబీఐనే లీడ్ బ్యాంక్ గా ఉంది. ఈ బ్యాంకులు 2010 నుంచి 42 వేల కోట్ల రూపాయల వరకూ వీరికి అప్పుగా అందించారు. ఇంకా 34,615 కోట్ల రూపాయలు బాకీ ఉంది. 2019లో దీన్ని ఎన్ పీఏగా ప్రకటించగా..2020లో దీన్ని మోసంగా గుర్తించారు. 2020-21 సంవత్సరాల్లో కెపీఎంజీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ఈ లావాదేవీలను పరిశీలిస్తే భారీ ఎత్తున నిధులను భూమితోపాటు ఇతర ప్రాపర్టీల్లో పెట్టుబడులకు మళ్లించినట్లు గుర్తించారు. వాద్వానీ సోదరులతోపాటు సుహానా గ్రూప్ నకు చెందిన సుధాకర్ శెట్టి, మరో పది రియల్ ఎస్టేట్ సంస్థలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. చాలా సంస్థల విషయంలో జరిగినట్లుగానే ఇక్కడ కూడా నిధుల మళ్ళింపు, ఆర్ధిక అవకతవకలు, ఖాతా పుస్తకాల్లో గోల్ మాల్ చర్యలకు పాల్పడినట్లు తేలింది.
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT