Telugu Gateway
Top Stories

దూసుకెళుతున్న 'సైకిళ్ళు'

దూసుకెళుతున్న సైకిళ్ళు
X

ఈ కరోనా కష్టకాలంలో అన్ని బిజినెస్ లు కుప్పకులాయి. ఫుల్ జోష్ లో ఉంది ఏదైనా ఉంది అంటే అది ఫార్మా..ఆస్పత్రులు మాత్రమే. వీటి తర్వాత జోష్ లో ఉంది సైకిళ్ళు. సైకిళ్ళు దూసుకెళుతున్నాయి. అది ఎంతలా అంటే ఏకంగా దశాబ్దకాంలలో ఎన్నడూలేని రీతిలో పరుగులు పెడుతున్నాయి. సైకిళ్ల డిమాండ్ 20 శాతం మేర పెరిగినట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. 2021 మార్చితో ముగిసిన కాలంలో 1.45 కోట్ల సైకిల్ యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ అమ్మకాలు 1.2 కోట్లు మాత్రమే ఉన్నాయి. కరోనా కారణంగా చాలా మంది ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టి సైకిళ్ళు కొనుగోలు చేశారు.

ఫిట్ నెస్ సైకిళ్ళతోపాటు అలా సరదా తిరిగేందుకు ఉద్దేశించిన సైకిళ్ళ విక్రయం కూడా బాగానే ఉంది. అంతర్జాతీయంగా భారత్ సైకిళ్ళ తయారీలో రెండవ స్థానంలో ఉంది. అయితే స్టాండర్డ్ సైకిళ్ళ విక్రయాలదే కీలక స్థానం. భారత్ నుంచి పలు దేశాలకు సైకిళ్ళు ఎగుమతి కూడా అవుతుంటాయి. దేశీయ తయారీలో సైకిళ్ళ ఎగుమతి వాటా పది శాతం గా ఉంది. అయితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సైకిళ్ళ డిమాండ్ తగ్గుముఖం పట్టింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్లు ఉండటం వంటి కారణాలతో డిమాండ్ తగ్గింది. రెండవ త్రైమాసికం నుంచి డిమాండ్ ఊపందుకోగలదని అంచనా.

Next Story
Share it