స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు
BY Admin20 Jan 2022 10:02 AM IST

X
Admin20 Jan 2022 10:02 AM IST
వరస పెట్టి దూకుడు ప్రదర్శించిన స్టాక్ మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి పతనబాటలో సాగుతోంది. అయితే ఇది బడ్జెట్ కు ముందు మార్కెట్లో సాగే కరెక్షనా?. లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. గురువారం ఉదయం నుంచి కూడా మార్కెట్లు నష్టాల్లోనే సాగుతున్నాయి. పది గంటల సమయంలో సెన్సెక్స్ 283 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. పలు రంగాలకు చెందిన షేర్లు పతన బాటలో సాగుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా రంగంపై ఒత్తిడి కన్పిస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉండటంతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా మదుపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. బడ్జెట్ తర్వాత మార్కెట్ దిశపై మరింత స్పష్టత వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
Next Story



