వ్యాక్సిన్ ఫస్ట్ డోసులు.. బెంగుళూరు టాప్
BY Admin4 Jun 2021 6:42 PM IST

X
Admin4 Jun 2021 6:42 PM IST
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి అత్యధిక ఫస్ట్ డోస్ లు వేసిన నగరంగా బెంగుళూరు నిలిచింది. జూన్ 3 సాయంత్రానికి కోవిన్ యాప్ లో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దీన్ని నిర్ధార్ధించారు. బెంగుళూరు నగరంలో జూన్ 3 వరకూ 29,34,030 మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. బెంగుళూరు తర్వాత 27,57,450 డోసులతో ముంబయ్ రెండవ స్థానంలో ఉండగా.. చెన్నయ్ లో 15,51,576, కలకత్తాలో 14,98,153 సింగిల్ డోసులు వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూన్ నెలలో 60 లక్షల డోసులు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Next Story



