ఎక్కడున్నా దసరా స్పెషల్
ఇది పండగల సీజన్. ఫస్ట్ వినాయక చవితి..ఆ వెంటనే దసరా...దీపావళి. తెలంగాణాలో దసరా పండగను ఎంత భారీ ఎత్తున నిర్వహిస్తారో అందరికి తెలిసిందే. ఉద్యోగ రీత్యా..ఇతర కారణాలతో వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా దసరా ను ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ ఆడపడుచులు అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు కెనడా లోని హాలిఫ్యాక్స్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
మ్యారిటైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరొక్కతీరు పూలతో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ను పేర్చి తెలంగాణ ఆడపడుచులు అంతా ఒకచోట చేరి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. బతుకమ్మ వేడుకల్లో తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.