Telugu Gateway
Top Stories

యాక్షన్ అంతా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లలోనే !

యాక్షన్ అంతా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లలోనే !
X

స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు లాభాలతో ముగిసాయి. మార్కెట్ లో యాక్షన్ ఎక్కువగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్స్ లోనే సాగింది అని చెప్పొచ్చు. ఈ షేర్లు లిస్ట్ అయిన ఫస్ట్ డే నే హల్చల్ చేశాయి. అటు బిఎస్ఈ తో పాటు ఎన్ఎస్ఈ లోనే ఈ కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ బ్రేకర్ ను తాకాయి. బిఎస్ఈ లో లిస్టింగ్ ధర కంటే 95 రూపాయల లాభంతో 165 రూపాయల అప్పర్ సర్క్యూట్ బ్రేకర్ ను తాకాయి. ఒక్క బిఎస్ఈ లోనే దగ్గర దగ్గర 6 .10 కోట్ల షేర్లు చేతులు మారాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ షేర్లు కొనుగోలు చేసే వాళ్లే తప్ప అమ్మేవారు కరువయ్యారు. ఎన్ఎస్ఈ లో అయితే ఏకంగా 63 .62 కోట్ల షేర్లు ట్రేడ్ అయ్యాయి. బంపర్ లిస్టింగ్ తో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 .37 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.

రాబోయే రోజుల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ట్రెండ్ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ఈ ఐపీఓ కు పెద్ద ఎత్తున స్పందన రాగా..చాలా మందికి షేర్స్ అలాట్ కాలేదు. దీంతో కొంత మంది సెకండరీ మార్కెట్ లో అయినా ఈ షేర్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించినట్లు కనిపించింది. గత కొన్ని రోజులుగా ప్రతికూల వార్తలతో సమస్యలు ఎదుర్కొన్న స్పైస్ జెట్ షేర్స్ కుడా సోమవారం నాడు మంచి లాభాలు గడించాయి. గత కొన్ని రోజులుగా ఈ ఎయిర్ లైన్స్ లోకి ప్రముఖ సంస్థ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అంటూ మార్కెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సోమవారం నాడు స్పైస్ జెట్ షేర్ ధర ఏడు రూపాయలు పెరిగి 78 రూపాయల వద్ద ముగిసింది. వీటితో పాటు అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్ భారీ లాభాలు గడించాయి.

Next Story
Share it