Telugu Gateway
Top Stories

అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య

అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య
X

అయోధ్య రామ మందిరం సందర్శనకు ఏటా ఐదు కోట్ల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది ప్రముఖ సంస్థ జేఫరీస్ అంచనా వేసింది. దీంతో ఈ ప్రాంతం రూపు రేఖలే పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది అని వెల్లడించింది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొత్త హోటల్స్ వచ్చి ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. ఒక్క హోటల్స్ మాత్రమే కాదు..అయోధ్య కారణంగా లాభపడే వాటిలో ఎయిర్ లైన్స్ తో పాటు ఆతిధ్య రంగం, ఎఫ్ఎంసిజీ రంగాలు కూడా ప్రయోజనం పొంతుతాయని వెల్లడించారు.ఇప్పటికే అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవం సందర్భంగా కొత్త ఎయిర్ పోర్ట్ ను అందుబాటులోకి తేవటంతో పాటు రైల్వే స్టేషన్ ను కూడా పూర్తిగా సుందరీకరించారు.

అయోధ్య కు రాబోయే రోజుల్లో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సోమవారం నాడు ప్రధాని మోడీ అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రెతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. దేశంలో నూతన పర్యాటక కేంద్రంగా అయోధ్య మారే అవకాశం ఉంది అని వెల్లడించారు. ఇప్పటి వరకు చారిత్రిక ప్రాంతంగా ఉన్న అయోధ్య రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు.

Next Story
Share it