'ప్రపంచ సంతోష దేశాల' జాబితాలో భారత్ స్థానం ఎక్కడో తెలుసా?

సంతోషం. అన్నింటి కంటే అత్యంత కీలకమైన అంశం. ఎంత సంపాదించాం అన్నదానికంటే ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నామన్నది అత్యంత కీలకం. ఇందుకు ప్రభుత్వాల అనుసరించే విధానాలతోపాటు ఆయా ప్రాంతాల్లోని పలు అంశాలు కూడా ప్రజల సంతోషానికి కొలమానంగా నిలుస్తాయి. చాలా మంది తక్కువ ఖర్చులోనే సంతోషాన్ని వెతుక్కుంటారు. మరి కొంత మంది మాత్రం ఎంత ఉన్నా కూడా సంతోషపడకుండా అలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఐక్యరాజ్య సమితి ప్రాయోజిత ప్రపంచ సంతోష దేశాల జాబితా విడుదలైంది.
ఇందులో మొత్తం 146 దేశాలతో జాబితా సిద్ధం చేయగా..భారత్ స్థానం 136లో ఉంది. చిట్టచివరి స్థానం మాత్రం ఆప్ఘనిస్తాన్ ది. ఈ జాబితాలో పాకిస్తాన్ స్థానం 121లో ఉండటం విశేషం. ప్రపంచ సంతోష జాబితాలో పిన్లాండ్ మొదటి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత డెన్మార్, ఐస్ లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, స్వీడన్ లు తదుపరి స్థానాలు దక్కించుకున్నాయి. నార్వే ఎనిమిదవ స్థానంలో ఉండగా, ఇజ్రాయెల్ తొమ్మిది, న్యూజిలాండ్ పదవ, ఆస్ట్రియా 11వ, ఆస్ట్రేలియా12వ, ఐర్లాండ్ 13వ, జర్మనీ14వ, కెనడా 15వ స్థానాన్ని దక్కించుకున్నాయి.



