Telugu Gateway
Top Stories

యాపిల్ వాచ్ కొత్త సంచలనం

యాపిల్  వాచ్ కొత్త సంచలనం
X

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది డయాబెటిక్ సమస్యతో బాధ పడుతున్నారు. నిత్యం ఈ కేసులు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రతిసారి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవటం కోసం చిన్నగా గా అయినా వేలిపై గాటుతో బ్లడ్ శాంపిల్ తీసుకోవాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో ఇక ఈ సమస్య ఉండదు. ఎందుకు అంటే ప్రముఖ సంస్థ యాపిల్ దీనికోసం కొత్త వాచ్ ను తీసుకొస్తోంది. యాపిల్ వాచ్ లో ఉండే లేజర్ టెక్నాలజీ ద్వారా శరీరంలోని గ్లూకోస్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు తెలియచేస్తాయి. ఈ వాచ్ తయారీకి సంబంధించి కీలక ముందడుగు పడినట్లు సమాచారం. చిప్ ఆధారిత లేజర్ టెక్నాలజీ వాచ్ శరీరం కింద ఉండే భాగం నుంచి షుగర్ లెవెల్స్ లెక్క తీస్తుంది. త్వరలోనే ఈ యాపిల్ వాచీలు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. . ఇది వాస్తవ రూపం దాల్చితే డయాబెటిక్ సమస్య ఉన్న వారికి ఇది పెద్ద ఉపయుక్తంగా ఉంటుంది అనటంలో సందేహం లేదు.

ఇది యాపిల్ కు ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద మార్కెట్ గా కూడా మారబోతుంది. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది డయాబెటిక్ సమస్య తో బాధ పడుతున్న విషయం తెలిసిందే. యాపిల్ చిప్ టెక్నాలజీ ద్వారా షుగర్ లెవెల్స్ కనిపెట్టే పని చేయనుంది. ఈ ప్రాజెక్ట్ పై యాపిల్ లో వందల మంది ఇంజనీర్స్ పనిచేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న స్మార్ట్ వాచ్ ల ద్వారా హార్ట్ బీట్ తో పాటు స్ట్రెస్ రేటింగ్ తో పాటు వాకింగ్ సమయంలో ఎన్ని క్యాలరీస్ కరిగించింది తెలుసుకునే వెసులుబాటు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు షుగర్ లెవెల్స్ తెలుసుకునే వాచ్ లు కూడా వస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది. ఈ వాచ్ ల విషయంలో కీలక ముందు అడుగు పడినట్లు వార్తలు రావటం యాపిల్ షేర్లు కూడా పెరిగాయి. కొన్ని యాపిల్ వాచీల్లో అయితే ఏకంగా ఈసీజీ తీసుకునే వెసులు బాటు కూడా ఉంది.

Next Story
Share it