భారతీయ సీఈవోల వైరస్ ఇది..దీనికి మందు లేదు
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియామకంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు అన్నింటికీ భారతీయులే సీఈవోలు ఉండటంపై ఇప్పటికే స్ట్రైప్ సీఈవో పాట్రిక్ కొలిసన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ కూడా స్పందించారు.
భారతీయ నైపుణ్యాల వల్ల అమెరికా ఎంతో లాభపడుతుందని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. స్ట్రైప్ సీఈవో పాట్రిక్ కొలిసన్ ట్వీట్ పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఇది కూడా ఓ రకమైన మహమ్మారి. భారతదేశం నుంచి సీఈవోలు అందరూ వచ్చారు అని చెప్పుకోవటానికి గర్వంగా ఉందన్నారు. ఇది భారతీయ సీఈవోల వైరస్ అని..దీనికి మందు లేదు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటి సంస్థల సీఈవోలు భారతీయులే ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.