Telugu Gateway
Top Stories

గొంతు విని ఏఐ ఇచ్చిన అమితాబచ్చన్ ఫోటో ఇది

గొంతు విని ఏఐ ఇచ్చిన అమితాబచ్చన్ ఫోటో ఇది
X

కేవలం గొంతు ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ ) ఇచ్చిన అమితాబచ్చన్ ఫోటో ఇది. ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేశారు. కేవలం ఒకే ఒక శబ్దంతో..వాయిస్ శాంపిల్ తో ఈ ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెనరేట్ చేసింది. దీన్ని చూసి ఏఐ ప్రజలను భయపెడుతుంది అంటూ ఒక నెటిజన్ ఈ ఫోటో పై స్పందించారు. కేవలం రఫ్ గా ఒక సౌండ్ శాంపిల్ ఇస్తే ఏఐ అమితాబచ్చన్ కు సంబంధించి ఈ తరహా ఫోటో ను ఇవ్వటం మాములు విషయం కాదు. ఈ టెక్నాలజీ విషయంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.

ఏఐ పితామహుడిగా పేరు ఉన్న జాఫ్రీ హింటన్ తాజాగా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఇప్పుడు వాతావరణ మార్పుల (క్లైమేట్ చేంజ్) గురించి కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుపై సత్వరమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని వెల్లడించారు. ఏఐ వల్ల కొన్ని లాభాలు ఉన్నా కూడా దీని వినియోగం గాడి తప్పితే ఊహించలేని ముప్పులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఏఐ వినియోగంపై నియంత్రణ అవసరం అని చెపుతున్నారు. ఏఐ తో సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కే ప్రమాదం ఉందనే భయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it