Telugu Gateway
Top Stories

వ్యాక్సిన్ అమెరికాకే ఫస్ట్..తర్వాతే ఎవరికైనా

వ్యాక్సిన్ అమెరికాకే ఫస్ట్..తర్వాతే ఎవరికైనా
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నినాదమే అమెరికా ఫస్ట్. ఉద్యోగాలు దగ్గర నుంచి ఏమైనా మొదట అమెరికన్లకే దక్కాలనేది ఆయన వాదం. దీంతోనే ఆయన అమెరికన్లలో గట్టి పట్టు సాధించారు. ఇప్పుడు అత్యంత కీలకమైన వ్యాక్సిన్ విషయంలో కూడా ట్రంప్ అదే బాట పట్టారు. ఫైజర్ వ్యాక్సిన్ ను ఎఫ్ డీఏ అత్యవసర అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్న తరుణంలో ట్రంప్ తొలుత వ్యాక్సిన్ అమెరికన్లకే అని..తర్వాతే ఎవరికైననా అందించే అంశంపై ఆలోచిస్తామంటూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా అవసరాలు తీరిన తర్వాత ఇతర దేశాలకు సరఫరా చేయాలని పేర్కొన్నారు. ట్రంప్ తాజా ఆదేశాలతో అమెరికాలో తయారు చేసే వ్యాక్సిన్లు అక్కడి ఫెడరల్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకే తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ మేరకు అధ్యక్షుడికి అధికారాలు దఖలుపడతాయి. కరోనాను త్వరలోనే ఖతం చేయనున్నట్లు ప్రకటించారు. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో తన నిర్ణయాలే కీలక పాత్ర పోషించాయని ట్రంప్ పేర్కొన్నారు. తాను మొదలుపెట్టిన ఆపరేషన్ వార్ప్ స్పీడ్ వల్లే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లు 95 శాతం సమర్ధత సాధించటం వెనక తాము పెట్టిన పెట్టుబడులు ఉన్నాయన్నారు. త్వరలోనే అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నామన్నారు. ఫైజర్, మోడెర్నా లకు ఎఫ్ డీఏ అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పలు రాష్ట్రాల కోర్టులు..చివరకు సుప్రీంకోర్టు కూడా ట్రంప్ పిటీషన్లను కొట్టేస్తున్నా..తాను అధ్యక్షుడిగా కొనసాగుతానంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.

Next Story
Share it