Telugu Gateway
Top Stories

భర్తల కంటే భరణాలే ఆకర్షణీయంగా మారుతున్నాయి!

భర్తల కంటే భరణాలే ఆకర్షణీయంగా మారుతున్నాయి!
X

మరీ ఎక్కువ సంపాదించకండి..మీ కోసం మీరు ఖర్చుపెట్టుకోండి

'బిల్ గేట్స్ విడాకులు. జెఫ్ బెజోస్ విడాకులు. ఇందులో నీతి ఏమిటంటే మరీ ఎక్కువ సంపాదించేయకండి..భర్తల కంటే భరణాలే ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మీ కోసం డబ్బు ఖర్చు పెట్టుకోండి' అంటూ ట్వీట్ చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా. ఆయన ఆర్ పీజీ గ్రూప్ ఛైర్మన్. నిజంగానే బిల్ గేట్స్..జెఫ్ బెజోస్ విడాకులు పెద్ద చర్చనీయాంశాలు గా మారిన విషయం తెలిసిందే. వీరి విడాకులతోపాటు విడిపోయే సమయంలో భార్యలకు ఇచ్చిన భరణాలు కూడా అంతే హాట్ టాపిక్ గా మారాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో మొదటిస్థానంలో ఉన్న బెప్ బెజోస్ 2019లో భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ సమయంలో భరణం కింద ఆమెకు ఏకంగా 2.8 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాడు.

దీంతో ఆమె ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనిక మహిళగా అవతరించింది. ఇప్పుడు బిల్ గేట్స్ విడాకుల వ్యవహారం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే వీరి విడాకులకు అధికారికంగా భరణాల అంశం ఏమీ ప్రకటించకపోయినా బిల్ గేట్స్ ఆస్తిలో ఆమెకు వాటా దక్కనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ కలసి మిలిండా పౌండేషన్ కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్ గా మారింది. అయితే ఆయన ట్వీట్ పై కొంత మంది నెటిజన్లు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.

Next Story
Share it