Telugu Gateway
Top Stories

మందుకో 'మ్యూజియం'

మందుకో మ్యూజియం
X

విచిత్రంగా ఉన్నా వాస్త‌వం ఇది. మందు కోసం అక్క‌డ ఏకంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాదు ఆ మందుకు కూడా పెద్ద చ‌రిత్రే ఉంది. అస‌లు ఈ మందు ఏంది..దీనికి మ్యూజియం ఏమిటి? ఇది ఎక్క‌డ అనుకంటున్నారా?. దేశంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం..బీచ్ ల రాజ‌ధాని అని పిలుచుకునే గోవాలో. ఒక‌ప్పుడు గోవా పేరు చెపితే గుర్తొచ్చే మందు ఫెని(Feni). ఒక‌ప్పుడు బీర్ తోపాటు ఈ ఫెనినే ఎక్కువ మంది ప‌ర్యాట‌కులు తీసుకునేవారు. అయితే ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్లు రావ‌టంతో ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన ఫెని మందు ప్రాభవం కోల్పోయింది. అయితే స్థానికులు ఇప్ప‌టికీ ఈ మందునే ఎక్కువ తీసుకుంటారు. ఫెని మందుకు ఉన్న ఘ‌న చ‌రిత్ర‌ను వివ‌రిస్తూ గోవాలో ఓ మ్యూజియం ఏర్పాటు చేశారు. కండోలిమ్ బీచ్ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలో స్థానిక పారిశ్రామిక‌వేత్త నంద‌న్ కుడ్ చేక‌ర్ దీన్ని ప్రారంభించారు.

ఫెని మందుకు సంబంధించిన ప‌లు క‌ళాఖండాల‌ను ఆయ‌న అందులో పొందుప‌ర్చారు. ఎంతో ఫేమ‌స్ అయిన ఈ ఫెని మందు బ్రెజిల్ నుంచి గోవాకు ఎలా వ‌చ్చిందనే అంశాలు ఈ మ్యూజియంలో పొందుప‌ర్చారు. గోవా ఎంపీ విన‌య్ టెండూల్క‌ర్ ట్విట్ట‌ర్ లో ఈ మ్యూజియం అంశాన్ని ప్ర‌స్తావించారు. ఇది స్థానిక పారిశ్రామిక‌వేత్త‌ల సాధికారిక‌త సాధించేందుకు ఇది ఉప‌యోప‌డుతుంద‌ని తెలిపారు. స్థానికులు విరివిగా సేవించే ఈ ఫెని మ‌ద్యాన్ని గోవా ప్ర‌భుత్వం 2016లో రాష్ట్ర హెరిటేజ్ డ్రింక్ గా ప్ర‌క‌టించింది. అంతే కాకుండా ఎగుమ‌తికి కూడా అవ‌కాశం క‌ల్పించింది. 1700 సంవ‌త్స‌ర కాలంలో వ‌ల‌స పాల‌కులు ఈ జీడిప‌ప్పు చెట్ల‌ను తొలుత గోవాకు బ్రెజిల్ నుంచి దిగుమ‌తి చేసుకున్న‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి జీడిప‌ప్పు నుంచే ఫెని మందు త‌యారు చేస్తారు.

Next Story
Share it