ఆకాశ ఎయిర్ లైన్స్ దూకుడు
సర్వీస్ లు ప్రారంభించిన పదకొండు నెలల కాలంలోనే ఆకాశ ఎయిర్ లైన్స్ రికార్డు నెలకొల్పింది. జూన్ నెలలో ఈ ఎయిర్ లైన్స్ దేశీయ విమానయాన రంగంలో ఎప్పటినుంచో సేవలు అందిస్తున్న స్పైస్ జెట్ ను వెనక్కి నెట్టి ఐదు శాతం మార్కెట్ వాటా సాధించింది. ఆకాశ ఎయిర్ లైన్స్ లో జూన్ నెలలో 6 . 2 లక్షల మంది ప్రయాణించారు. అదే స్పైస్ జెట్ లో ప్రయాణించిన వారి సంఖ్య 5 . 5 లక్షలు ఉంది. దేశీయ విమానయన మార్కెట్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ లీడర్ గా ఉంది. ఈ సంస్థ మార్కెట్ వాటా 63 . 2 శాతం ఉంది. టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా 9 .7 శాతంతో రెండవ ప్లేస్ లో నిలిచింది. 8 . 1 శాతంతో విస్తార ఎయిర్ లైన్స్ మూడవ స్థానంలో నిలిచింది.
ఇది కూడా టాటా గ్రూప్ కు చెందినదే అన్న విషయం తెలిసిందే. కాంపిటీషన్ కమిషన్ అఫ్ ఇండియా (సిసిఐ ) అనుమతి వస్తే ఈ రెండు ఎయిర్ లైన్స్ విలీనం కానున్నాయి. ఇది వచ్చే ఏడాది నాటికీ పూర్తి అయ్యే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ఎయిర్ ఇండియా , విస్తారా ల మార్కెట్ వాటాలు కలిపితే ఇది 25 . 8 శాతం అవుతుంది. ఆకాశ ఎయిర్ లైన్స్ దగ్గర ప్రస్తుతం 19 విమానాలు ఉన్నాయి. త్వరలోనే మరో విమానం కూడా అందుబాటులోకి రానుంది. ఇది వస్తే కంపెనీ చేతిలో 20 విమానాలు ఉంటాయి...అప్పుడు విదేశీ రూట్ల లో కూడా సర్వీస్ లు స్టార్ట్ చేయటానికి ఆకాశ ఎయిర్ లైన్స్ కు అర్హత వస్తుంది. 2023 జూన్ లో మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1 . 25 కోట్ల కు చేరినట్లు డీజిసిఏ గణాంకాలు చెపుతున్నాయి.