పైలట్ ల రాజీనామాతో విలవిల
ఆకాశ ఫ్లీట్ లో మొత్తం బోయింగ్ 737 విమానాలు ఉండటంతో ఈ విమానాలు నడిపే పైలట్ లను వెంటనే నియమించుకోవడం కష్టంగా మారింది. ఏ 320 విమానాలతో పోలిస్తే బోయింగ్ 737 పైలట్ లు దొరకటం కొంత కష్టం అని పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. తాజాగా ఆకాశ కు 20 వ విమానం కూడా రావటంతో విదేశీ రూట్లలో సర్వీసులు స్టార్ట్ చేసే అర్హత వచ్చింది. ఈ తరుణంలో ఒకే సారి పైలట్ లు రాజీనామా చేయటం పెద్ద దెబ్బగా మారింది. మరో వైపు కొంత పైలట్ లు కూడా తమపై దాఖలు చేసిన కేసు లపై బాంబే హై కోర్టు ను ఆశ్రయించారు. ఆకాశ కు రాజీనామా చేసిన వారు ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ లో చేరినట్లు చెపుతున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ , దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అతి తక్కువ సమయంలో దూసుకెళ్లిన ఆకాశ ఎయిర్ ..ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో పడింది. మరి ఈ సమస్య నుంచి ఆకాశ ఎయిర్ ఎలా బయటపడుతుందో వేచిచూడాల్సిందే.