Telugu Gateway
Top Stories

ఎయిర్ న్యూజిలాండ్ వెరైటీ నిర్ణయం

ఎయిర్ న్యూజిలాండ్ వెరైటీ నిర్ణయం
X

విమానంలో ప్రయాణించే వారి లగేజ్ కు కూడా పరిమితలు ఉంటాయనే విషయం తెలిసిందే. చెక్ ఇన్ బ్యాగేజ్ లో అయితే ఇంత అని..హ్యాండ్ బ్యాగేజ్ లో అయితే ఇన్ని కిలోలకు అని అనుమతి ఉంటుంది. అంతర్జాతీయ రూట్లలో అయితే ఒక్కో ఎయిర్ లైన్స్ లగేజ్ పాలసీ ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎయిర్ లైన్స్ ఏకంగా విమానం ఎక్కే ప్రయాణికుడి బరువు కూడా చెక్ చేస్తామని చెపుతోంది. బోర్డింగ్ పాస్ జారీ చేసే చోట ప్రయాణికులు బరువు కూడా చెక్ చేస్తామని వెల్లడించింది. ప్యాసెంజర్ వెయిట్ సర్వే పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ వివరాలు తీసుకుని పైలట్ కు అందచేస్తామని...దీంతో విమానం గాల్లోకి లేవటానికి ముందే విమానంలో మొత్తం ఎంత బరువు ఉంది అనే విషయం పైలట్ కు తెలుస్తుంది అని ఆ ఎయిర్ లైన్స్ తెలిపింది.

న్యూజిలాండ్ కు చెందిన ఎయిర్ న్యూజిలాండ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రయాణికుల బరువు తెలుసుకునేందుకు ఆక్లాండ్ విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రయాణికుల అనుమతి లేకుండా వారి బరువు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయం అని...ఇది పూర్తిగా స్వచ్ఛందం అని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ప్రయాణికుల బరువు వివరాలు సిబ్బంది ఎవరు చూడరు..కేవలం పైలట్ కు మాత్రమే ఈ సమాచారం అందిస్తామని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఐదేళ్ల పాటు ఈ సర్వే కొనసాగనుంది. తమ విమాణంలోకి వెళ్లే ప్రతి వస్తువు బరువు ను తాము లెక్కిస్తామని..ప్రయాణికులకు అందించే ఆహారం తో పాటు విమాన సిబ్బంది లగేజ్ వివరాలు కూడా లెక్కిస్తామని ఎయిర్ న్యూజిలాండ్ తెలిపింది.

Next Story
Share it