Telugu Gateway
Top Stories

అమెరికాకు విమాన సర్వీసులు తగ్గిస్తున్న ఎయిర్ ఇండియా

అమెరికాకు విమాన సర్వీసులు తగ్గిస్తున్న ఎయిర్ ఇండియా
X

భారత్-అమెరికా ల ఎక్కువ మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసులు నడిపిస్తున్న దేశీయ ఎయిర్ లైన్ సంస్థ ఎయిర్ ఇండియా. ముఖ్యంగా పైలట్ లు, ఇతర సిబ్బంది కొరత కారణంగా అమెరికాకు విమాన సర్వీసుల్లో కోత పెడుతున్నట్లు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంపు బెల్ విల్సన్ వెల్లడించారు. ఇది ఒక రెండు నుంచి మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది అని వెల్లడించారు. న్యూ యార్క్ లోని నెవార్క్ విమానాశ్రయం, శాన్ ఫ్రాన్సిస్కో కు ప్రతివారం నడిపే సర్వీసుల్లో ఈ కోత పడుతుంది. బోయింగ్ 777 విమానాలు నడిపే పైలట్స్ ను తీసుకోబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా నెవార్క్ కు వారంలో ఆరు విమానాలు, శాన్ ఫ్రాన్సిస్కో కు వారానికి 17 విమానాలు నడుపుతోంది. వీటిలో ఇప్పుడు పైలట్ లు , సిబ్బంది కొరత కారణంగా కోత పెట్టనున్నారు. రాబోయే రెండు నుంచి మూడు నెలల కాలంలో వంద మంది పైలట్ లు, 1400 కేబిన్ సిబ్బంది నియమాకాలు చేపట్టనుంది .

దీని తర్వాత తాము ఎలాంటి సిబ్బంది కొరతను ఎదుర్కొనే అవకాశం ఉండదని వెల్లడించారు. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ చేతికి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే సిబ్బంది కొరతను తొలగించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా వైడ్ బాడీ విమానాల నిర్వహణకు సంబంధించి సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. అదే కారణంతో ఇప్పుడు అమెరికా కు సర్వీసుల్లో కోత పెట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

.

Next Story
Share it