టాటాలకు ఎయిర్ ఇండియాను అప్పగించిన సర్కారు
లాంచనం పూర్తి అయింది. దేశానికి చెందిన ప్రతిష్టాత్మక ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా టాటాల చేతికి అందింది. ఎయిర్ ఇండియాను బిడ్డింగ్ ద్వారా టాటా గ్రూపు ఎప్పుడో దక్కించుకున్నా ఈ ప్రక్రియ పూర్తి కావటానికి చాలా సమయం తీసుకుంది. గురువారం నాడు అధికారికంగా ఈ ఎయిర్ లైన్స్ ను టాటాలకు అప్పగించినట్లు కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఈ ఫోటోలలనుఉ పీఎంవో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన ఈ ఎయిర్ లైన్స్ ను ప్రైవేట్ పరం చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసిన కేంద్రం గత ఏడాది ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు టాటా గ్రూప్ ఈ ఎయిర్ లైన్స్ ను ఎలా గాడిన పెడుతుందో వేచిచూడాల్సిందే. ఎయిర్ ఇండియా రాకపోతే టాటా గ్రూప్ దేశ ఎయిర్ లైన్స్ రంగంలో కీలక సంస్థగా మారనుంది. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియాలు టాటా గ్రూప్ చేతిలో ఉన్న విషయం తెలిసిందే.