Telugu Gateway
Top Stories

ట్రాఫిక్ సిగ్నల్స్..మొబైల్ నెట్ వర్క్స్ హ్యాక్ చేసిన ఇజ్రాయెల్!

ట్రాఫిక్ సిగ్నల్స్..మొబైల్ నెట్ వర్క్స్ హ్యాక్ చేసిన ఇజ్రాయెల్!
X

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత ఈజీగా అమెరికా-ఇజ్రాయెల్ లకు ఎలా చిక్కాడు. గత కొన్ని రోజులుగా అమెరికా బహిరంగంగానే ఇరాన్ పై యుద్దానికి కాలు దువ్వుతున్న వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఉన్నారు. అమెరికా ఎప్పటి నుంచో ఇరాన్ పై యుద్దానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఒక వైపు చర్చలు జరుపుతూనే ఎవరూ ఊహించని రీతిలో సడన్ గా ఇరాన్ పై దాడులకు దిగి అయతుల్లా అలీ ఖమేనీ తో పాటు ఎంతో మంది కీలక నేతలను హతమార్చింది. ఈ తరుణంలో ఒక ఆసక్తికరం విషయం వెలుగులోకి వచ్చింది. టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్ ఎంతో ముందు ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ తమ టార్గెట్ ను పూర్తి చేసేందుకు కూడా దాన్నే ఉపయోగించింది. అది ఎలా అంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ట్రాఫిక్ కెమెరాలతో పాటు మొబైల్ ఫోన్ నెట్ వర్క్స్ ను హ్యాక్ చేసి తమ పని పూర్తి చేసుకుంది. 86 సంవత్సరాల అయతుల్లా అలీ ఖమేనీ హతమార్చటంలో ఇవే అత్యంత కీలకంగా మారాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ టెహ్రాన్ లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేస్తూ వస్తోంది.

టెహ్రాన్ లోని పాస్టర్ స్ట్రీట్ లోని కార్యాలయం లో అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ కు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం అయిన సమయంలోనే గత శనివారం నాడు ఇజ్రాయెల్-అమెరికా లు చేసిన దాడి లో ఖమేనీ తో పాటు కీలక అధికారులు మరణించిన సంగతి తెలిసిందే. హ్యాక్ చేసిన వాటిలో ముఖ్యంగా ఒక కెమెరా నుంచే కీలక సమాచారం వచ్చినట్లు బ్రిటిష్ డైలీ ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొంది. ఈ సమాచారం ఆధారంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో పాటు ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించి టార్గెట్ ను కంప్లీట్ చేశారు. ఖమేనీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాలను పార్క్ చేసే ప్రదేశాలను కూడా ఇజ్రాయెల్ నిత్యం ట్రాక్ చేసేది అని ఇందులో వెల్లడించారు. కచ్చితమైన సమాచారం ఆధారంగానే ఫిబ్రవరి 28 న ఖమేనీ ఉన్న ఆఫీస్ పై పక్కాగా దాడులు చేశారు.

Next Story
Share it