Telugu Gateway
Top Stories

అదానీ గ్రూప్ పై ఓసిసిఆర్ పీ సంచలన ఆరోపణలు

అదానీ గ్రూప్ పై ఓసిసిఆర్ పీ సంచలన ఆరోపణలు
X

అదానీ గ్రూప్ మరో సారి చిక్కుల్లో పడింది. అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ ఈ గ్రూప్ కు మరో షాక్ తగిలింది. ఈ సారి కూడా విదేశాలకు చెందిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్ (ఓసిసిఆర్ పీ) సంచలన ఆరోపిణలు చేసింది. పన్నుల తక్కువ ఉండే పలు దేశాల్లోని పత్రాలు, అదానీ గ్రూప్ కు చెందిన అంతర్గత ఈ మెయిల్స్ పరిశీలించి ఈ విషయాలను గుర్తించినట్లు ఓసిసిఆర్ పీ బహిర్గతం చేసింది. ముఖ్యంగా రెండు కేసుల్లో అనుమానాస్పద ఇన్వెస్టర్లు విదేశీ ఫండ్స్ ద్వారా కొనటం, అమ్మటం చేసినట్లు వెల్లడించారు. నాసర్ అలీ షాబాన్అహ్లీ , చాంగ్ చుంగ్ లింగ్ అనే ఇద్దరు వ్యక్తులు అదానీ కుటుంబంతో దీర్ఘకాలంగా బిజినెస్ డీల్స్ చేస్తున్నట్లు వెల్లడించింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి చెందిన పలు కంపెనీల్లో వీళ్ళు డైరెక్టర్స్ గా, వాటాదారులుగా ఉన్నట్లు ఓసిసిఆర్ పీ తెలిపింది. వీళ్ళే విదేశీ ఫండ్స్ ద్వారా అదానీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేయటం, అమ్మటం చేసినట్లు తేల్చారు. దీని ద్వారా భారీ ఎత్తున సంపాదించినట్లు గుర్తించారు. నాసర్ అలీ షాబాన్ అహ్లీ, చాంగ్ చుంగ్ లింగ్ లు గ్రూప్ ప్రమోటర్లు తరపునే వ్యవహరిస్తున్నట్లు భావించాలా అని ఓసిసిఆర్ పీ సందేహం వ్యక్తం చేసింది. ఇదే నిజం అయితే కంపెనీలో ఇన్‌సైడర్ లే 75 శాతం వాటాలను సొంతం చేసుకున్నట్లు అవుతుంది అని వెల్లడించింది.

ఇది ఇండియా లో లిస్టింగ్ నిబంధలను వ్యతిరేకం అని తెలిపింది. అదానీ షేర్ల లో వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే ట్రేడింగ్ జరిగినట్లు తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొన్నారు. అయితే అదానీ ఫ్యామిలి నుంచి డబ్బులు తీసుకుని చేసినట్లు మాత్రం తమకు ఆధారాలు దొరకలేదు అన్నారు. ఓసిసిఆర్ పీ జార్జి సొరస్ పెట్టుబడులతో నడిచే సంస్థ. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. ఇవి హిండెన్ బర్గ్ రిపోర్ట్ లోని అంశాలను రీ సైకిల్ చేయటం వంటిదే తప్ప మరొకటి కాదు అని వివరణ ఇచ్చింది. ఇది అంతా విదేశీ ఫండ్స్, కొన్ని విదేశీ మీడియా సంస్థల కుట్రగా అభివర్ణించింది గ్రూప్. దేశంలో న్యాయప్రక్రియ సాగుతున్న వేళ ఈ దశలో ఈ రిపోర్ట్ రావటంపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఓసిసిఆర్ పీ రిపోర్ట్ తో గురువారం నాడు అదానీ గ్రూప్ షేర్లు అన్ని భారీగా నష్ట పోయాయి. అదానీ గ్రూప్ లోని ఫ్లాగ్ షిప్ కంపెనీ అయినా అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ 95 రూపాయల నష్టంతో 2418 రూపాయల వద్ద ముగిసింది. గ్రూప్ లోని అన్ని లిస్టెడ్ కంపెనీలు భారీ నష్టాలను మూట కట్టుకున్నాయి. ఈ ఎపిసోడ్ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ కూడా స్పందించింది. మరో సారి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది.

Next Story
Share it