Telugu Gateway
Top Stories

విమాన టిక్కెట్ల ఆమ్మకంలోకి 'అదానీ వన్ '

విమాన టిక్కెట్ల ఆమ్మకంలోకి అదానీ వన్
X

విమానాశ్రయాల నిర్వహణే కాదు..విమాన టిక్కెట్ల అమ్మకం వ్యాపారం లోకి కూడా అదానీ గ్రూప్ ప్రవేశించింది. విమాన టిక్కెట్ల వరకే కాదు..చివరకు క్యాబ్ సర్వీసులు కూడా అందించనుంది. దీని కోసం 'అదానీ వన్ ' పేరుతో వెబ్ సైట్ తో పాటు ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీనికి సంబదించిన యాడ్స్ ప్రస్తుతం పెద్ద ఎత్తున దర్శనం ఇస్తున్నాయి. అదానీ గ్రూప్ ఏవియేషన్ రంగంలోకి అడుగు పెట్టిన కొద్దికాలంలోనే దేశ విమానయాన రంగంలో కీ ప్లేయర్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ చేతిలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయం తో పాటు అహ్మదాబాద్, లక్నో, గౌహతి, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం విమానాశ్రయాలు ఉన్న విషయం తెలిసిందే.

అదానీ వన్ ద్వారా కంపెనీ తమ డిజిటల్ జర్నీ ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ యాప్ ను కొద్దీ నెలల్లో సూపర్ యాప్ గా మార్చాలనే ఆలోచనలో కంపెనీ ఉంది. కొద్ది రోజుల క్రితమే అదానీ ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఉబెర్ లు ఒక ఒప్పందం చేసుకున్నాయి. అంతకు ముందు అదానీ ట్రావెల్ యాప్ క్లియర్ ట్రిప్ లో కూడా కొద్దిపాటి వాటా తీసుకుంది. తాజా పరిణామాలు అన్ని చూస్తుంటే అదానీ వన్ రాబోయే రోజుల్లో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేది అవకాశం ఉందని చెపుతున్నారు.

Next Story
Share it