షేర్ల రిగ్గింగ్ అదానీ కి అలవాటేనా..కేతన్ పరేఖ్ తో కలిసి అదే పని!
దీనికి కారణం కేతన్ పరేఖ్ స్కాం లో వీరి పాత్రా ఉన్నట్లు సెబీ విచారణలో తేలటమే. 1999 అక్టోబర్ నుంచి 2001 మార్చి మధ్య కాలంలో వివాదాస్పద స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్, అదానీ ప్రమోటర్లు కలిసి అదానీ షేర్లలో రిగ్గింగ్ కు పాల్పడినట్లు సెబీ తేల్చింది. ఈ కాలంలో అదానీ ఎక్సపోర్ట్స్ షేర్ లో అసాధారణ కదలికలు ఉండటం తో సెబీ విచారణ చేసింది. ఈ విచారణలో కేతన్ పరేఖ్ తో పాటు ఆయన కనుసన్నల్లో ఉండే కంపెనీలు మోసాలకు పాల్పడినట్లు తేల్చారు. అంతే కాదు అదానీ గ్రూప్, కేతన్ పరేఖ్ సంస్థల మధ్య షేర్ల లావాదేవీలతో పాటు నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పుడు దీనికి సంబదించిన టైమ్స్ అఫ్ ఇండియా వార్త క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. ఇది చూసిన వాళ్లకు ..అదానీ గ్రూప్ కు గతంలో కూడా ఘనమైన చరిత్రే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది చూసిన వాళ్లకు హిండెన్ బర్గ్ రిపోర్ట్ నిజమే అనిపించటంలో ఏ మాత్రం ఆశ్చ్చర్యం అనిపించదు మరి.