అదానీ షేర్లలో 10 వేలు పెడితే 52 వేలు అయింది
కరోనా కష్టకాలంలోనూ అదానీ కంపెనీల మాయాజాలం
కరోనా కష్టకాలం వచ్చి ఏడాదికిపైనే అయింది. కానీ విచిత్రంగా గత ఏడాది కాలంలో అదానీ గ్రూప్ కు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల్లో పది వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఆ మొత్తం ఇప్పుడు 52 వేల రూపాయలు అయింది. ఈ ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.64 లక్షల కోట్ల రూపాయల నుంచి 8. 5 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే 12 నెలల కాలంలో ఏకంగా 420 శాతం రిటర్న్స్ వచ్చినట్లు గా తేల్చారు.
ఇలా కరోనా కష్టకాలంలో దూసుకెళ్లిన షేర్లలో అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్ మిషన్,అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్ అండ్ అదానీ పోర్ట్స్ ఎస్ఈజెడ్ ఉన్నాయి. గత కొంత కాలంగా అదానీ గ్రూప్ పలు రంగాల్లోకి విస్తరించటంతోపాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ముందుకెళుతోంది. సంపద విషయంలో ఒక్క ముఖేష్ అంబానీ మాత్రమే ఆయన కంటే ముందున్నారు. మిగిలిన బడాబడా పారిశ్రామికవేత్తలు అందరినీ అదానీ వెనక్కినెట్టేశారు. ఈ ఆసక్తికర విషయాలను బిజినెస్ ఇన్ సైడర్ వెల్లడించింది.