అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ కు చేరిన ప్రతిపాదన!

ఇరాన్ ఎంతకూ దారికి రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లో ఫ్రస్ట్రేషన్ పీక్ కు చేరుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఆయన అసభ్య పదజాలంతో ఇరాన్ పై విమర్శలు చేస్తూ తన సోషల్ మీడియా ట్రూత్ లో పెట్టిన పోస్ట్ ఒక ఉదాహరణ అన్న చర్చ కూడా సాగుతోంది. డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను హెచ్చరిస్తూ వాడిన భాష ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నాయకులను కూడా షాక్ కు గురి చేసింది. ఇక్కడ మరో కీలక విషయం అమెరికా అధ్యకుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని సార్లు సీరియస్ వార్నింగ్ లు ఇచ్చిన కూడా ఇరాన్ మాత్రం ఎప్పటిలాగానే లైట్ తీసుకుంటోంది. ఇరాన్ కు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు దగ్గరకు వచ్చినా కూడా ఇరాన్ ఇదేమి పట్టించుకోవటం లేదు. డోనాల్డ్ ట్రంప్ చెపుతున్నట్లు తమ దేశంలోని విద్యుత్ ప్లాంట్లు...బ్రిడ్జి లు ధ్వంసం చేస్తే తాము కూడా అమెరికా, ఇజ్రాయెల్ లకు సర్ప్రైజ్ లు ఇస్తామని హెచ్చరించింది. ఒక వైపు వార్నింగ్ లు ఇస్తూనే మరో వైపు అమెరిగా-ఇజ్రాయిల్ లు సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్ పై భారీ దాడులకు దిగారు. ఇరాన్ లోని పాలనా భవనాలపై భారీ ఎత్తున దాడులు చేయగా..ఇందులో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెపుతున్నారు.
దీంతో పాటు షరీఫ్ యూనివర్శిటీ పై కూడా అమెరికా, ఇజ్రాయిల్ లు క్షిపణులతో దాడికి దిగాయి. హర్ముజ్ జలసంధి తెరిచి ఉంచినా ఇరాన్ శత్రువులకు మాత్రం మూసే ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తే ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటుంది అని ఇరాన్ హెచ్చరించింది. డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అమెరికా ప్రజలతో పాటు ఎవరికీ తెలియదు అని...అందుకే ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలి అని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ ప్రజలను ఆదేశించింది. ఈ తరుణంలో ఒక కీలక ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సమస్యల్లోకి నెడుతున్న ఈ యుద్దానికి ముగింపు పలికేలా రెండు వైపులా నుంచి 45 రోజల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదనను అంతర్జాతీయ మధ్యవర్తులు ముందుకు తెచ్చారు. ఈ విషయంలో ఈజిప్ట్, తుర్కయే కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెపుతున్నారు.
తొలుత ఈ కాల్పుల విరమణకు అంగీకరించి తర్వాత...ఆయా దేశాలు ముఖాముఖీ భేటీతో ఈ సమస్యకు శాశ్వతంగా ఒక మార్గం చూసుకోవటం ఉత్తమం అనే ప్రతిపాదన వచ్చింది. దీని ప్రకారం ఇరు దేశాలు ఎటువంటి దాడులకు పాల్పడకుండా 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలి. ఈ చర్చల్లో ఖతార్, ఒమన్ వంటి దేశాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెపుతున్నారు. ఇవి అటు అమెరికాతో, ఇటు ఇరాన్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు ఇచ్చిన గడువు మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ గడువు లోపు ఇరాన్ ఒక నిర్ణయానికి రావాలని ఆయన హెచ్చరించారు. ఈ తరుణంలో 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన రావటం విశేషం. అయితే దీనికి ఇరాన్ ఎంత మేర అంగీకరిస్తుంది అన్నదే అత్యంత కీలకంగా మారబోతుంది అని చెప్పాలి.



