పది సెకన్లలో 144 అంతస్థులను కూల్చేశారు
BY Admin9 Dec 2020 4:57 PM IST

X
Admin9 Dec 2020 4:57 PM IST
పది సెకన్లు. 144 అంతస్థులు. కన్పించకుండా పోయింది. వినటానికి వింతగా ఉన్నా ఇది వంద శాతం వాస్తవం. అంతే కాదు ఈ కూల్చివేత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లోని అబుదాబిలో ఇది జరిగింది. 165 మీటర్ల ఎత్తైన ఈ టవర్ ను గత నెలలో పది సెకన్లలో కన్పించకుండా చేశారు.
మినా ప్లాజా టవర్స్ లో ఇది ఉంది. పేలుడు పదార్ధాలు ఉపయోగించి ఎత్తైన భవనాన్ని అతి తక్కువ కాలంలో కూల్చివేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఇది నమోదు అయింది. 915 కిలోల డిటోనేటర్లను ఉపయోగించి నియంత్రిత కూల్చివేత పద్దతి ద్వారా ఈ పని పూర్తి చేశారు.
Next Story



