Telugu Gateway
Top Stories

నలభై ఒక్క రోజులు..32 లక్షల పెళ్లిళ్లు

నలభై ఒక్క రోజులు..32 లక్షల పెళ్లిళ్లు
X

పెళ్లి అంటే ఆ ఆయా కుటుంబాల్లో ఒక వేడుక..మరి కొంత మందికి ఇది ఒక వ్యాపారం. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చింది అంటే పెద్ద ఎత్తున షాపింగ్ ఉంటదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి అంటే ఉండే హంగామా వేరు. ఇప్పుడు సామాన్యుల నుంచి..మధ్య తరగతి ప్రజలు కూడా పెళ్ళికి భారీగా ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. కొంత మంది పెళ్లి సమయం లో పెద్ద ఎత్తున అప్పులు కూడా చేస్తున్నారు. తాజాగా పెళ్లిళ్లకు సంభందించి ఆసక్తికర లెక్కలు బయటకు వచ్చాయి. దేశ వ్యాప్తంగా నలభై ఒక్క రోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయట. వీటి ద్వారా జరిగే వ్యాపారం 3 75 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సిఏఐటి) అంచనా వేసింది. ఈ పెళ్లిళ్లు అన్ని కూడా నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 మధ్య కాలంలో జరుగుతాయని తెలిపారు. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య చేపట్టిన సర్వే లో ఈ విషయాలు వెలుగు చూశాయి. దేశ రాజధాని ఢిల్లీ లోనే 3 .5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని..వీటి ద్వారానే 75 వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుందని లెక్కలు వేశారు. 35 నగరాల్లో 4302 మంది వ్యాపారుల వద్ద అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ఈ సర్వే చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఢిల్లీ లో 25 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. డిసెంబర్ తర్వాత మళ్ళీ పెళ్లిళ్ల సీజన్ జనవరి 14 నుంచి ప్రారంభం అవుతుంది.

Next Story
Share it