Telugu Gateway
Top Stories

జీఎస్ టి తగ్గింపు...పండగ ఆఫర్లు!

జీఎస్ టి తగ్గింపు...పండగ ఆఫర్లు!
X

దేశంలో పండగల సీజన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ దసరా...తర్వాత దీపావళి. ప్రజలకే కాదు..ఈ సారి కార్ల కంపెనీలకు కూడా ఇది పెద్ద పండగ గా నిలిచిపోనుంది. ప్రతి ఏటా కూడా పండగల సమయంలో కార్ల అమ్మకాలు ఇతర సీజన్ ల తో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. కేంద్రం ఇప్పటి వరకు భారీగా వడ్డించిన జీఎస్ టి ని తగ్గించటంతో ఇప్పుడు కార్ల అమ్మకాలు కొత్త రికార్డు లు నమోదు చేయబోతున్నాయి. జీఎస్ టి తగ్గింపుతో పాటు దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి వంటి కంపెనీలు ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించాయి. ఈ ప్రభావం నవరాత్రి ఉత్సవాల మొదటి రోజే కనిపించింది. ఈ రష్...ఈ అమ్మకాలు గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడు నమోదు కాని రేంజ్ కు వెళ్లాయి. మారుతి సుజుకి ఇండియా కు ఫస్ట్ డే ఎనభై వేల ఎంక్వయిరీ లు రాగా..తొలిరోజు 30000 కార్ల డెలివరీలు జరిగాయి. అదే సమయంలో కొత్త బుకింగ్స్ కూడా గతంతో పోలితే చాలా ఎక్కువ గా నమోదు అవుతున్నాయి.

మరో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండయ్ ఇండియా మోటార్ లిమిటెడ్ కూడా నవరాత్రి తోలి రోజు ఏకంగా 11000 కార్ల కు బిల్లింగ్ చేసింది. గత ఐదేళ్ల కాలంలో ఇంత భారీ స్థాయిలో బిల్లింగ్స్ జరగటం ఇదే మొదటి సారి కావటం విశేషం. మారుతి, హ్యుండయ్ కంపెనీలే కాకుండా టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) కార్ల అమ్మకాలు కూడా గణనాయంగా పెరిగినట్లు చెపుతున్నారు. ఈ ట్రెండ్ పండగల సీజన్ అంతా కొనసాగే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జీఎస్ టి తగ్గింపు ఆటోమొబైల్ రంగంలో కొత్త జోష్ నింపినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ దెబ్బకు కంపెనీల దగ్గర ఉన్న ఇన్వెంటరీ లు తగ్గటం తో పాటు అమ్మకాలు కొత్త కొత్త రికార్డు లు నమోదు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. తగ్గించిన జీఎస్ టి అమల్లోకి వచ్చిన తొలిరోజు ఈ కార్ల అమ్మకాలు పెద్ద ఎత్తున ఉండటంతో స్టాక్ మార్కెట్ లో మంగళవారం ఉదయమే మారుతి తో పాటు హ్యుండయ్ ఇండియా షేర్లు కూడా మంచి లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద ఆటోమొబైల్ కంపెనీలు అన్ని లాభాల బాటలో సాగుతున్నాయి.

Next Story
Share it